Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:29 PM

**అభివృద్ధి గడప దాటని బుడిగ జంగాల కాలనీ డ్రైనేజీ లేదు.. తాగునీరు లేదు.. రేషన్ షాప్ లేదు

27-06-2026 46 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు గడుస్తున్నా మండల కేంద్రంలోని బుడిగ జంగాల (ఎస్సీ) కాలనీలో ప్రజల జీవితాల్లో మార్పు కనిపించడం లేదని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు జల్లెల పెంటయ్య విమర్శించారు. అభివృద్ధిలోనూ దళితులపై వివక్ష కొనసాగుతోందని ఆరోపించారు.

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ, సీపీఎం టౌన్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం కాలనీలో ఇంటింటి సర్వే నిర్వహించి, సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా కాలనీవాసులు ఎదుర్కొంటున్న సమస్యలను నాయకుల దృష్టికి తీసుకొచ్చారు.

20 ఏళ్ల క్రితం నిర్మించిన కాలనీలో నేటికీ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మురుగు నీరు ఇళ్ల ముందే నిలిచిపోతోందని, వర్షాలు కురిసిన ప్రతిసారి కాలనీ బురదమయంగా మారి దోమలు, ఈగలతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని వాపోయారు.

తాగునీటి సమస్య కూడా తీవ్రంగా ఉందని, కాలనీలోని రెండు బోర్‌వెల్లు ఐదారు సంవత్సరాలుగా చెడిపోయినా మరమ్మతులకు నోచుకోలేదని తెలిపారు. కొన్ని ఇళ్లకు నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయిందని, వెంటనే బోర్లను బాగుచేసి తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.

కాలనీలో రేషన్ షాప్ ఏర్పాటు చేయడంతో పాటు అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, రేషన్ కార్డులు మంజూరు చేయాలని కోరారు. జిల్లా కలెక్టర్, తహసీల్దార్, ఎంపీడీవో, గ్రామపంచాయతీ కార్యదర్శి కాలనీని తక్షణమే సందర్శించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జల్లెల పెంటయ్య డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో కందుల హనుమంతు, గొరిగె సోములు, బావండ్ల బాలరాజు, గాదె నరేందర్, మేడి ముకుందం, మునుకుంట్ల లెనిన్, పల్లె సత్యం, కుందూరు వెంకటేశం, వెంకట్‌రెడ్డి, గంజి అశోక్, సల్ల రాజు, విష్ణు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

**అభివృద్ధి గడప దాటని బుడిగ జంగాల కాలనీ డ్రైనేజీ లేదు.. తాగునీరు లేదు.. రేషన్ షాప్ లేదు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News