Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
స్నేహానికి చావు లేదు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:55 PM

ఎమ్మెల్యేపై చౌకబారు ఆరోపణలు మానుకోండి!

ఎమ్మెల్యేపై చౌకబారు ఆరోపణలు మానుకోండి!

ఎమ్మెల్యేపై చౌకబారు ఆరోపణలు మానుకోండి!
27-06-2026 157 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

*​అసత్య ప్రచారాలపై నేలపట్ల సర్పంచ్ గంగాపురం వసంత నగేష్ గౌడ్ ధ్వజం

*పార్టీలకతీతంగా పనిచేసే నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

*ప్రజల కష్టమే ఎమ్మెల్యేకు మొదటి ప్రాధాన్యం అని స్పష్టం

ప్రజలను తప్పుదోవ పట్టించేలా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై చౌకబారు ఆరోపణలు చేయడం మానుకోవాలని చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామ సర్పంచ్ గంగాపురం వసంత నగేష్ గౌడ్ హెచ్చరించారు. నేలపట్లలో విలేకరులతో మాట్లాడిన ఆమె, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పార్టీలకతీతంగా పనిచేస్తూ అన్ని గ్రామాల అభివృద్ధికి సమాన ప్రాధాన్యం ఇస్తున్న గొప్ప నాయకుడని కొనియాడారు.మౌలిక సదుపాయాల కొరత ఉన్న ప్రాంతాలకు మొదటి ప్రాధాన్యం ఇచ్చి అభివృద్ధి పనులు చేపడుతున్నారని తెలిపారు. ఎమ్మెల్యే పక్షపాతం చూపించే వ్యక్తి అయితే, నేడు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నాయకులు తమ గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిని ప్రశంసించే పరిస్థితి ఉండేదే కాదని పేర్కొన్నారు.

సర్పంచ్ వసంత మాట్లాడుతూ.. “ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి పార్టీలు, జెండాలు, వర్గాలు కనిపించవు. ప్రజలు కష్టాల్లో ఉంటే ఆయన తట్టుకోలేరు. ఏ పార్టీ వారైనా సహాయం కోరితే వెంటనే స్పందిస్తారు” అని అన్నారు.కేంద్రం నుంచి వచ్చే నిధులను ప్రజల అవసరాలకు అనుగుణంగా వినియోగించడం ప్రజాప్రతినిధి బాధ్యత అని ఆమె స్పష్టం చేశారు. ఆధారాలు లేకుండా అసత్య ప్రచారాలు చేయడం వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని మండిపడ్డారు.విమర్శలు చేయడం చాలా సులువని, కానీ ప్రజల మధ్య ఉంటూ సమస్యలు పరిష్కరించడం ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిలాంటి నాయకులకే సాధ్యమని అన్నారు.నియోజకవర్గ అభివృద్ధికి అందరూ సహకరించాలి

ఎమ్మెల్యేపై చౌకబారు రాజకీయాలు, అసత్య ప్రచారాలను నిలిపివేసి నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సర్పంచ్ గంగాపురం వసంత నగేష్ గౌడ్ పిలుపునిచ్చారు.

Sthanikam

ఎమ్మెల్యేపై చౌకబారు ఆరోపణలు మానుకోండి!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News