Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:32 PM

నల్లగొండకు అందుబాటులోకి ఆధునిక స్కాన్ సేవలు. శ్రీ రూబీ స్కాన్ సెంటర్‌ను ప్రారంభించిన మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి

27-06-2026 39 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ రూబీ స్కాన్ సెంటర్‌ను శనివారం మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. డిప్యూటీ మేయర్ మొహమ్మద్ అష్రఫ్ అలీ, ప్రత్యేక ఆహ్వానితురాలు వంగూరి నవ్యశ్రీ రాఖీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

డా. శ్రీకాంత్ పెరిక ఆధ్వర్యంలో అత్యాధునిక సాంకేతిక పరికరాలతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ప్రజలకు నాణ్యమైన వైద్య నిర్ధారణ సేవలు అందించనుంది. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, నామమాత్రపు రుసుములతో ప్రజలకు మెరుగైన స్కానింగ్ సేవలు అందించి విశ్వాసాన్ని పొందాలని ఆకాంక్షించారు.

డా. శ్రీకాంత్ పెరిక మాట్లాడుతూ, న్యూఢిల్లీలో పదేళ్ల అనుభవం అనంతరం స్వస్థలమైన నల్లగొండలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, 24 గంటలపాటు నాణ్యమైన స్కానింగ్ సేవలు అందిస్తామని తెలిపారు.

కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ వంగిరి లక్ష్మయ్య, డాక్టర్ తల్లిదండ్రులు రూతమ్మ–భీమయ్య, కుటుంబ సభ్యులు, వైద్యులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.

Sthanikam

నల్లగొండకు అందుబాటులోకి ఆధునిక స్కాన్ సేవలు. శ్రీ రూబీ స్కాన్ సెంటర్‌ను ప్రారంభించిన మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి

Article Image

నల్లగొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ రూబీ స్కాన్ సెంటర్‌ను శనివారం మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. డిప్యూటీ మేయర్ మొహమ్మద్ అష్రఫ్ అలీ, ప్రత్యేక ఆహ్వానితురాలు వంగూరి నవ్యశ్రీ రాఖీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

డా. శ్రీకాంత్ పెరిక ఆధ్వర్యంలో అత్యాధునిక సాంకేతిక పరికరాలతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ప్రజలకు నాణ్యమైన వైద్య నిర్ధారణ సేవలు అందించనుంది. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, నామమాత్రపు రుసుములతో ప్రజలకు మెరుగైన స్కానింగ్ సేవలు అందించి విశ్వాసాన్ని పొందాలని ఆకాంక్షించారు.

డా. శ్రీకాంత్ పెరిక మాట్లాడుతూ, న్యూఢిల్లీలో పదేళ్ల అనుభవం అనంతరం స్వస్థలమైన నల్లగొండలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, 24 గంటలపాటు నాణ్యమైన స్కానింగ్ సేవలు అందిస్తామని తెలిపారు.

కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ వంగిరి లక్ష్మయ్య, డాక్టర్ తల్లిదండ్రులు రూతమ్మ–భీమయ్య, కుటుంబ సభ్యులు, వైద్యులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News