Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్‌ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు....... ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 02, 2026 11:04 AM

యర్కారంలో బగ్గుమన్న రాజకీయ కక్షలు బీఆర్ఎస్ నాయకుడు చింతలపాటి మధు దారుణ హత్య

23-05-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట మండలం యర్కారం గ్రామంలో రాజకీయ కక్షలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ సర్పంచ్ భర్త చింతలపాటి మధు దారుణ హత్యకు గురైన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

గ్రామంలో జరిగిన ఘర్షణలో మధుపై ప్రత్యర్థులు దాడి చేసినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటన నేపథ్యంలో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు హత్యకు గల కారణాలు, రాజకీయ విభేదాల కోణంలో దర్యాప్తు చేపట్టారు. మధు మృతితో యర్కారం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Sthanikam

యర్కారంలో బగ్గుమన్న రాజకీయ కక్షలు బీఆర్ఎస్ నాయకుడు చింతలపాటి మధు దారుణ హత్య

Article Image

సూర్యాపేట మండలం యర్కారం గ్రామంలో రాజకీయ కక్షలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ సర్పంచ్ భర్త చింతలపాటి మధు దారుణ హత్యకు గురైన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

గ్రామంలో జరిగిన ఘర్షణలో మధుపై ప్రత్యర్థులు దాడి చేసినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటన నేపథ్యంలో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు హత్యకు గల కారణాలు, రాజకీయ విభేదాల కోణంలో దర్యాప్తు చేపట్టారు. మధు మృతితో యర్కారం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News