Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 03:46 AM

యాదగిరిగుట్టలో ప్రభుత్వ వైద్య కళాశాల స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్

11-03-2026 391 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్ట, యాదగిరిగుట్టలో నూతనంగా నిర్మించనున్న ప్రభుత్వ వైద్య కళాశాల కోసం కేటాయించిన స్థలాన్ని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి బుధవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని సందర్శించి అక్కడ చేపట్టాల్సిన పనుల పురోగతిపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. వైద్య కళాశాల నిర్మాణ పనులు ఎప్పటి నుంచి ప్రారంభించారో, ప్రస్తుతం చేపడుతున్న ఏర్పాట్ల గురించి అధికారులు కలెక్టర్‌కు వివరించారు.

అనంతరం వైద్య కళాశాల భవనానికి సంబంధించిన నమూనా మ్యాప్‌ను పరిశీలించిన కలెక్టర్, విద్యార్థులు మరియు వైద్య సిబ్బందికి అవసరమైన అన్ని సౌకర్యాలు ఉండేలా నిర్మాణ పనులు చేపట్టాలని సూచించారు.

వైద్య కళాశాల నిర్మాణాన్ని ఆలస్యం చేయకుండా వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వైద్య కళాశాల నిర్మాణం పూర్తయితే జిల్లాలో వైద్య విద్యకు మరింత ప్రోత్సాహం లభించడమే కాకుండా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మెడికల్ అధికారులు, ఇంజినీరింగ్ విభాగం డీఈ, తహశీల్దార్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

యాదగిరిగుట్టలో ప్రభుత్వ వైద్య కళాశాల స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News