Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:22 AM

యాదగిరిగుట్టలో నాగార్జున గ్రామీణ బ్యాంక్ స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణకు సిద్ధం

29-04-2026 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్ట,

నాగార్జున గ్రామీణ బ్యాంక్ స్థాపనకు 50 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నిర్వహించనున్న స్వర్ణోత్సవ వేడుకలకు యాదగిరిగుట్టలో విస్తృత ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పెన్షనర్స్ అసోసియేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా రీజనల్ సెక్రటరీ బర్రె సుదర్శన్ తెలిపారు.

గురువారం యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి మున్నూరు కాపు నిత్యాన్నదాన చారిటబుల్ ట్రస్ట్ ఆవరణలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్. సుభాష్ రెడ్డి, మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డా. డి. శ్రీనివాసులు, నాబార్డ్ మాజీ చీఫ్ జనరల్ మేనేజర్ పి. మోహనయ్య, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ కే. ప్రతాప్ రెడ్డి, మాజీ చైర్మన్ రామచంద్రా రెడ్డి, సంగమేశ్వర గ్రామీణ బ్యాంక్ మాజీ చైర్మన్ ఎస్. వెంకటేశ్వర రెడ్డి, సెక్రటరీ జనరల్ గణపతి హెగ్డే, మాజీ జనరల్ సెక్రటరీ బి. రవికాంత్, గోల్డెన్ సభ్యుడు మారిశెట్టి వీరయ్య తదితరులు హాజరుకానున్నారు.

సమావేశంలో బ్యాంక్ స్థాపన, అభివృద్ధి ప్రయాణం, ఉద్యోగులు, పెన్షనర్ల సేవలు, బ్యాంక్ సాధించిన ప్రగతి తదితర అంశాలపై చర్చించనున్నారు.

ఈ స్వర్ణోత్సవ వేడుకలకు సభ్యులు, ఉద్యోగులు, ఖాతాదారులు మరియు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని బర్రె సుదర్శన్ కోరారు.

Sthanikam

యాదగిరిగుట్టలో నాగార్జున గ్రామీణ బ్యాంక్ స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణకు సిద్ధం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News