Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:54 PM

యాదాద్రి జిల్లా ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా సూర్కంటి శ్రీధర్‌రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

07-06-2026 53 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మందోళ్లగూడెం ఉపసర్పంచ్‌కు కీలక బాధ్యతలు

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: శ్రీధర్‌రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా ఉప సర్పంచ్‌ల ఫోరం జిల్లా అధ్యక్షుడిగా మందోళ్లగూడెం గ్రామ ఉపసర్పంచ్ సూర్కంటి శ్రీధర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చౌటుప్పల్‌లో నిర్వహించిన ఫోరం ముఖ్య సమావేశంలో ఈ ఎన్నిక ప్రక్రియ ముగిసింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఉప సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు చోట్ల కార్తీక్ ముఖ్య అతిథిగా హాజరై, నూతనంగా ఎన్నికైన శ్రీధర్ రెడ్డిని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.​ఈ సందర్భంగా నూతన జిల్లా అధ్యక్షుడు సూర్కంటి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ కీలక బాధ్యతను అప్పగించిన జిల్లాలోని ఉపసర్పంచులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉపసర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, వారి హక్కుల పరిరక్షణకు నిరంతరం కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల బలోపేతంతో పాటు, గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం ఫోరం తరఫున శ్రమిస్తానని పేర్కొన్నారు.​రాష్ట్ర అధ్యక్షుడు చోట్ల కార్తీక్ మాట్లాడుతూ.. శ్రీధర్ రెడ్డి నాయకత్వంలో జిల్లాలో ఉపసర్పంచుల ఫోరం మరింత బలోపేతం అవుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఉపసర్పంచుల సంక్షేమానికి ఈ కమిటీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.​శ్రీధర్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక కావడం పట్ల జిల్లాలోని పలువురు ప్రజాప్రతినిధులు, ఉపసర్పంచులు, స్థానిక నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఎన్నిక జిల్లా ఉపసర్పంచుల ఐక్యతకు నిదర్శనమని వారు కొనియాడారు.

Sthanikam

యాదాద్రి జిల్లా ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా సూర్కంటి శ్రీధర్‌రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News