Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:45 AM

వృద్ధాశ్రమానికి లక్ష రూపాయల విరాళం**

వృద్ధాశ్రమానికి లక్ష రూపాయల విరాళం**

వృద్ధాశ్రమానికి లక్ష రూపాయల విరాళం**
12-03-2026 44 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Rangareddy dist
RAPOLU LINGASWAMY

రంగారెడ్డి జిల్లా :సమాజ సేవలో ముందుండే బిజుమళ్ళ మాధవ సూర్యనారాయణ శర్మ సిద్ధాంతి స్మారక సేవ భారతి ట్రస్ట్ తన 16వ వార్షికోత్సవం సందర్భంగా వృద్ధాశ్రమానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసింది.

ట్రస్ట్ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన నారాయణ సేవ కార్యక్రమంలో భాగంగా వనస్థలిపురంలోని రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న వృద్ధాశ్రమానికి రూ.1,00,000 విరాళాన్ని ట్రస్ట్ ప్రతినిధులు అందజేశారు.

2010లో స్థాపించబడిన ఈ ట్రస్ట్ “ధర్మో రక్షతి రక్షిత అనే సూక్తిని ఆదర్శంగా తీసుకుని గత 16 సంవత్సరాలుగా వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తోంది. వైదిక విద్యాభివృద్ధి, గోమాత సేవ, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు విద్యా సహాయం అందించడం, అన్నదానం వంటి కార్యక్రమాలను ట్రస్ట్ చేపడుతోంది.

ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రతినిధులు మాట్లాడుతూ సమాజానికి సేవ చేయడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. వృద్ధాశ్రమానికి అందజేసిన ఈ విరాళం సమాజం పట్ల తమ కృతజ్ఞతను తెలియజేసే చిన్న ప్రయత్నమని పేర్కొన్నారు.

రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ ప్రతినిధులు ట్రస్ట్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ, అందిన విరాళాన్ని వృద్ధాశ్రమంలో నివసిస్తున్న వృద్ధుల అవసరాల కోసం వినియోగిస్తామని తెలిపారు.

Sthanikam

వృద్ధాశ్రమానికి లక్ష రూపాయల విరాళం**

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News