Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కోదాడ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:54 PM

విశాల భారతి పాఠశాలలో 'సమ్మర్ క్యాంప్' సందడి

27-04-2026 289 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

శ్రీ గాయత్రి ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న విశాల భారతి హైస్కూల్ వేసవి శిబిరం (సమ్మర్ క్యాంప్) సోమవారం వి.వి.ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. మున్సిపల్ కౌన్సిలర్ కాసర్ల మంజుల శ్రీనివాసరెడ్డి, ప్రముఖులు బండారు సుజాత శేఖర్, ఆంటోనీ ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సుజాత శేఖర్ మాట్లాడుతూ.. విద్యార్థులు వేసవి సెలవులను కేవలం ఆటలకే పరిమితం చేయకుండా, ఇలాంటి శిబిరాల ద్వారా తమలోని సృజనాత్మకతను వెలికితీయాలని సూచించారు. ముఖ్యంగా వేదిక్ మ్యాథ్స్, జ్ఞాపకశక్తి పెంపుదల, చేతిరాత(హ్యాండ్‌రైటింగ్)మెరుగుపరుచుకోవడం వంటివి విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. అనంతరం సమ్మర్ క్యాంప్ కోఆర్డినేటర్ ఆంటోనీ మాట్లాడుతూ.. ఈ శిబిరంలో నేర్పించబోయే 12 రకాల కీలక అంశాల గురించి వివరించారు.

​పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ వీసం చైతన్య క్రాంతి వర్ధన్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, క్రమశిక్షణతో చదివి తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.​ ప్రారంభోత్సవం అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో​పాఠశాల డైరెక్టర్ ఆవుల అశోక్​ఆందోజు నాగభూషణం,కౌన్సిలర్ కాసర్ల మంజుల శ్రీనివాస్ రెడ్డి, ​పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్, సమ్మర్ క్యాంపు కోఆర్డినేటర్ ఆంటోనీ, ​ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

విశాల భారతి పాఠశాలలో 'సమ్మర్ క్యాంప్' సందడి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News