Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:29 PM

విరిగిన కుర్చీలపై సమావేశం భయంతో కూర్చున్న అధికారులు, ప్రజాప్రతినిధులు

16-04-2026 235 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశంలో అవ్యవస్థలు వెలుగుచూశాయి. సమావేశానికి హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులకు ఏర్పాటు చేసిన కుర్చీలు పూర్తిగా దెబ్బతిన్నవిగా ఉండటం విమర్శలకు దారితీసింది.

మీటింగ్ హాల్లో ఉంచిన పలుచోట్ల ప్లాస్టిక్ కుర్చీలు విరిగిపోయి ప్రమాదకర స్థితిలో ఉన్నప్పటికీ, వాటినే వినియోగించాల్సి రావడంతో హాజరైనవారు అసౌకర్యానికి గురయ్యారు. కుర్చీలు ఎప్పుడు విరిగిపోతాయోనన్న ఆందోళన మధ్య సమావేశంలో పాల్గొనాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ప్రభుత్వ కార్యాలయంలో జరిగే ముఖ్యమైన సమావేశానికి కనీస సదుపాయాలు లేకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Sthanikam

విరిగిన కుర్చీలపై సమావేశం భయంతో కూర్చున్న అధికారులు, ప్రజాప్రతినిధులు

Article Image

: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశంలో అవ్యవస్థలు వెలుగుచూశాయి. సమావేశానికి హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులకు ఏర్పాటు చేసిన కుర్చీలు పూర్తిగా దెబ్బతిన్నవిగా ఉండటం విమర్శలకు దారితీసింది.

మీటింగ్ హాల్లో ఉంచిన పలుచోట్ల ప్లాస్టిక్ కుర్చీలు విరిగిపోయి ప్రమాదకర స్థితిలో ఉన్నప్పటికీ, వాటినే వినియోగించాల్సి రావడంతో హాజరైనవారు అసౌకర్యానికి గురయ్యారు. కుర్చీలు ఎప్పుడు విరిగిపోతాయోనన్న ఆందోళన మధ్య సమావేశంలో పాల్గొనాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ప్రభుత్వ కార్యాలయంలో జరిగే ముఖ్యమైన సమావేశానికి కనీస సదుపాయాలు లేకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News