Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:15 AM

వికలాంగుల పెన్షన్ రూ.6 వేలకు పెంచాలి: ఉపేందర్

02-05-2026 78 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అడ్డగూడూరు: వికలాంగుల పెన్షన్‌ను రూ.6 వేలుగా అమలు చేయాలని ఎన్‌పీఆర్‌డీ జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మే 1 నుంచి 10 వరకు వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం చిర్రగూడూరు, జానకాపురం, సవుల్లా రామారం గ్రామాల్లో నిర్వహించిన సర్వేలో పాల్గొన్న ఉపేందర్ మాట్లాడుతూ, యూడీఐడీ కార్డులు ఉన్నప్పటికీ గత ఐదేళ్లుగా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

ప్రభుత్వం హామీ ఇచ్చిన రూ.6 వేల పెన్షన్‌ను తక్షణమే అమలు చేసి, కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని కోరారు. అలాగే ప్రతి వికలాంగుడికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా చిర్రగూడూరు, జానకాపురం, సవుల్లా రామారం గ్రామాల్లో ఎన్‌పీఆర్‌డీ కమిటీలను ఎన్నుకున్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు చిత్తలూరి శ్రీహరి, మండల అధ్యక్షుడు దుస్సా వెంకటేశం, గ్రామ నాయకులు శీల శోభ, మాదాని బాలరాజు, చింత పరశురాములు, బోనాల బాబు, సంఘీ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వికలాంగుల పెన్షన్ రూ.6 వేలకు పెంచాలి: ఉపేందర్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News