Sthanikam - Truth Matters
Logo

వెలుగుమట్ల బాధితులకు మద్దతు… కవిత అరెస్ట్

Updated : 09 Mar 2026 16:28 IST
As Preferred Source 1 min read
వెలుగుమట్ల బాధితులకు మద్దతు… కవిత అరెస్ట్

వెలుగుమట్లలో ఆందోళన… పోలీసుల అదుపులో కవిత

ఖమ్మం: ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ బాధితులకు మద్దతుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సోమవారం జడ్పీ సెంటర్ వద్ద ఆందోళన చేపట్టారు. కూల్చివేసిన చోటే బాధితులకు సొంత ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో బాధితులు, జాగృతి కార్యకర్తలు అక్కడికి చేరుకొని నినాదాలు చేశారు. పోలీసులు ఆందోళనను అడ్డుకునే క్రమంలో ఉద్రిక్తత నెలకొంది.

పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు కవితతో పాటు భూదాన్ బాధితులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో జడ్పీ సెంటర్ పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Sthanikam

వెలుగుమట్ల బాధితులకు మద్దతు… కవిత అరెస్ట్

Article Image

వెలుగుమట్లలో ఆందోళన… పోలీసుల అదుపులో కవిత

ఖమ్మం: ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ బాధితులకు మద్దతుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సోమవారం జడ్పీ సెంటర్ వద్ద ఆందోళన చేపట్టారు. కూల్చివేసిన చోటే బాధితులకు సొంత ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో బాధితులు, జాగృతి కార్యకర్తలు అక్కడికి చేరుకొని నినాదాలు చేశారు. పోలీసులు ఆందోళనను అడ్డుకునే క్రమంలో ఉద్రిక్తత నెలకొంది.

పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు కవితతో పాటు భూదాన్ బాధితులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో జడ్పీ సెంటర్ పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

మరిన్ని

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి