Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 01:17 AM

వాత్సల్య ఇంజనీరింగ్ కళాశాలలో బుద్ధ పూర్ణిమ వేడుకలు

01-05-2026 24 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

: యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాత్సల్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్‌లో బుద్ధ పూర్ణిమ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, ఫార్మసీ కళాశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు.

కళాశాల చైర్మన్ దరిపల్లి నవీన్ కుమార్ మాట్లాడుతూ గౌతమ బుద్ధుడు ప్రపంచానికి శాంతి, అహింస, మానవత్వ మార్గాన్ని చూపిన మహానుభావుడని పేర్కొన్నారు. బుద్ధుని బోధనలు నేటి సమాజానికి మార్గదర్శకాలని, దయ, కరుణ, సహనం, సమానత్వం వంటి విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని సూచించారు. విద్యార్థులు బుద్ధుని ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని క్రమశిక్షణతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

సంస్థ సెక్రటరీ దరిపల్లి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ బుద్ధుని బోధనలు సమాజ నిర్మాణానికి శాశ్వత మార్గదర్శకాలని అన్నారు. శాంతి, అహింస, మానవసేవ వంటి విలువలు యువతలో పెంపొందాలని ఆకాంక్షించారు. విద్యతో పాటు మంచి విలువలు అలవర్చుకున్నప్పుడే ఉత్తమ పౌరులుగా ఎదగగలరని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డీన్ డాక్టర్ మొగిలిచర్ల ప్రదీప్, ప్రిన్సిపల్ బి.వి. రెడ్డి, ఫార్మసీ ప్రిన్సిపల్ భవాని, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

వాత్సల్య ఇంజనీరింగ్ కళాశాలలో బుద్ధ పూర్ణిమ వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News