Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:30 PM

వైన్ షాప్ కు వ్యతిరేకంగా మహిళల సంఘటిత స్వరం

04-02-2026 128 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని చిట్యాల మున్సిపాలిటీ 09వ వార్డులో కొనసాగుతున్న వైన్ షాప్ కారణంగా ఏర్పడుతున్న సమస్యలపై స్థానిక మహిళలు సంఘటితంగా ముందుకొచ్చారు. మహిళలు, పిల్లల భద్రతకు ముప్పుగా మారుతున్న వైన్ షాప్‌ను తొలగించాలని కోరుతూ మహిళలు నకిరేకల్ ఎమ్మెల్యే వేములవీరేశంకువినతిపత్రంఅందజేశారు.నివాస ప్రాంతంలో వైన్ షాప్ కొనసాగడం వల్ల నిత్యం గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయని, అసభ్య ప్రవర్తనతో మహిళలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని వారు తెలిపారు. పిల్లలు స్వేచ్ఛగా బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని, కుటుంబాల ప్రశాంత జీవనం దెబ్బతింటోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.

సామాజిక బాధ్యతతో మహిళలు స్వయంగా ముందుకొచ్చి సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం ప్రశంసనీయమని పలువురు అభిప్రాయపడ్డారు. మహిళల వినతిపై స్పందించిన ఎమ్మెల్యే వేముల వీరేశం సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.మహిళల ఐక్యతతో వ్యక్తమైన ఈ నిరసన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Sthanikam

వైన్ షాప్ కు వ్యతిరేకంగా మహిళల సంఘటిత స్వరం

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News