Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రైతులకు మార్కెట్ రేటు పరిహారం ఇవ్వాలని సిపిఎం ధర్నా గిరిజన గురుకుల పాఠశాలలో అడ్మిషన్లు ప్రారంభం ఎస్సై చైతన్య చందర్ పై వేటు పడింది వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం నూతన పాల్గొన్న టిడిపి రాష్ట్ర కార్యదర్శి సామకోటి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 27, 2026 08:46 PM

విద్యార్థులకు చదువే లక్ష్యం కావాలి!

విద్యార్థులకు చదువే లక్ష్యం కావాలి!

విద్యార్థులకు  చదువే లక్ష్యం కావాలి!
April 27, 2026 06:44 PM 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

శిశు సంరక్షణ సంస్థల విద్యార్థులకు జిల్లా కలెక్టర్ పిలుపు..

​సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా గుర్తింపు పత్రాల పంపిణీ బాలల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం..


నల్గొండ : విద్యార్థులు క్రమశిక్షణతో చదివి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆకాంక్షించారు. 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. బాలల భద్రత, రక్షణ మరియు 'మత్తు పదార్థాలకు నో చెప్పండి' (Say No to Drugs) అనే నినాదంతో ఈ నెల 27 నుండి మే 2 వరకు నిర్వహిస్తున్న సంక్షేమ వారోత్సవాలను ఆయన ప్రారంభించారు.


అండగా ఉంటాం.. ఆదుకుంటాం


జిల్లాలోని చైల్డ్ కేర్ ఇన్‌స్టిట్యూషన్లలో (CCIs) ఆశ్రయం పొందుతున్న బాలల సంక్షేమానికి జిల్లా యంత్రాంగం నిరంతరం కృషి చేస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా 18 ఏళ్ల లోపు బాలబాలికలకు ప్రభుత్వం తరపున వివిధ గుర్తింపు పత్రాలను ఆయన పంపిణీ చేశారు. ఇందులో ముఖ్యంగా..జనన ధృవీకరణ పత్రాలు, కుల, నివాస ధృవీకరణ పత్రాలు, హెల్త్ కార్డులు, బ్యాంక్ సేవింగ్స్ ఖాతా పుస్తకాలు, ఆధార్ కార్డులను అందజేశారు.

సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలి..


​కలెక్టర్ మాట్లాడుతూ.. శిశు సంరక్షణ సంస్థల్లో ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చదువు ఒక్కటే పేదరికం నుండి బయటపడేస్తుందని ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి నిరంతర కృషి అవసరమని హితవు పలికారు. బాలల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ (ఇంచార్జ్) వై. అశోక్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి పాల్గొన్నారు. వారితో పాటు జిల్లా పరిషత్ సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, జిల్లా బాలల పరిరక్షణ అధికారి కె. గణేష్, చైల్డ్ లైన్ జిల్లా కో-ఆర్డినేటర్ బి. మహేశ్ మరియు బాలల పరిరక్షణ విభాగ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News