Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:32 PM

వెలిమినేడు రూపురేఖలు మారుస్తా.. 'అంతటి నర్సింహ' మేనిఫెస్టో అదిరింది!

08-12-2025 190 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నేను మీకు నాయకుడిని కాదు.. మీ సేవకుడిని.. మన ఊరి అభివృద్ధి కోసమే నా తపన" అంటూ వెలిమినేడు సర్పంచ్ అభ్యర్థి అంతటి నర్సింహ గౌడ్ (గుర్తు: ఉంగరం) జనంలోకి దూసుకెళ్తున్నారు. తాజాగా ఆయన విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో వెలిమినేడు ప్రజల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఊరి సమస్యలన్నింటికీ పరిష్కారం చూపిస్తూ 'పక్కా ప్లాన్'తో ముందుకొచ్చారు.

మేనిఫెస్టో హైలైట్స్ - అంతటి నర్సింహ హామీలు:

ఉచిత అంబులెన్స్ & స్వర్గపురి వాహనం:

ప్రజల ఆరోగ్యం కోసం తన సొంత నిధులతో, తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఉచిత అంబులెన్స్ ఏర్పాటు చేస్తానని, అలాగే ఎవరైనా మరణిస్తే కులమతాలకు అతీతంగా అంతిమ యాత్ర కోసం స్వర్గపురి వాహనం (Free Hearse Service) అందిస్తానని గొప్ప మనసు చాటుకున్నారు.

వెలిమినేడు - మండలం కల:

మన వెలిమినేడు గ్రామాన్ని 'మండల కేంద్రం' (Mandal Headquarter)గా మార్చేందుకు కృషి చేస్తానని, ప్రభుత్వ కార్యాలయాలు ఇక్కడికే వచ్చేలా చేస్తానని హామీ ఇచ్చారు.

భద్రత & సీసీ కెమెరాలు:

గ్రామంలో దొంగతనాలు జరగకుండా 'గ్రామ రక్షక పోలీసింగ్' (Night Patrolling) ఏర్పాటు చేస్తామని, ప్రతి వార్డులో సీసీ కెమెరాలు పెట్టిస్తామని చెప్పారు.

నీళ్లు & డ్రైనేజీ:

అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు నిర్మించి, మురికి నీటి సమస్య లేకుండా చేస్తామని, బీసీ, ఎస్సీ కాలనీల్లో RO వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు.

యువత & ఉపాధి:

యువత కోసం స్పెషల్ స్టేడియం, లైబ్రరీ, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కోసం కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయడమే కాకుండా.. స్థానిక పరిశ్రమల్లో మనోళ్లకే ఉద్యోగాలు ఇప్పించేలా కొట్లాడతామని చెప్పారు.

మహిళా సాధికారత:

డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు, కుట్టు మిషన్లు, మగ్గం వర్క్ ట్రైనింగ్ ఇప్పించి వాళ్లు సొంత కాళ్ల మీద నిలబడేలా చేస్తామన్నారు.

వైద్యం:

ప్రస్తుతం ఉన్న ఆసుపత్రిని 20 పడకల ఆసుపత్రిగా మారుస్తామని, గర్భిణుల కోసం ప్రత్యేక సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు.

"నిత్యం 365 రోజులు మీ సేవలోనే.." "నేను ఎలక్షన్లప్పుడు వచ్చే టూరిస్ట్‌ను కాదు.. 30 ఏళ్లుగా మీ మధ్యనే ఉంటూ, ఏ పదవి లేకున్నా సేవ చేస్తున్న మనిషిని. పోస్ట్ మాస్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ మీ కోసం వచ్చా.. నన్ను ఆశీర్వదించండి" అని అంతటి నర్సింహ గౌడ్ ఓటర్లను కోరుతున్నారు.

వెలిమినేడు ఓటర్లారా.. మన ఊరి అభివృద్ధిని కాంక్షించే అంతటి నర్సింహ గౌడ్ గారికి, ఆయన గుర్తు 'ఉంగరం' (Ring) పై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించండి!

Sthanikam

వెలిమినేడు రూపురేఖలు మారుస్తా.. 'అంతటి నర్సింహ' మేనిఫెస్టో అదిరింది!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News