Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 08:26 AM

వడ్డెర జాతికి గుర్తింపు తీసుకొచ్చిన నాయకురాలు గుంజే రేణుక నారాయణ

11-05-2026 103 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్‌గా ఎన్నికైన గుంజే రేణుక నారాయణకు తెలంగాణ వడ్డెర సంఘం నాయకులు ఘనంగా అభినందనలు తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు మంజుల రమేష్ ఆదేశాల మేరకు సంఘం తరఫున శుభాకాంక్షలు తెలియజేశారు.

గత కొన్ని సంవత్సరాలుగా అట్టడుగు వర్గాల వడ్డెర కుల సమస్యలపై గుంజే రేణుక నారాయణ ఎన్నో పోరాటాలు చేశారని, ఎస్టీ సాధనతో పాటు వడ్డెర కార్మికుల హక్కుల కోసం నిరంతరం కృషి చేశారని నాయకులు పేర్కొన్నారు. అలాంటి నాయకురాలు కార్పొరేషన్ చైర్మన్‌గా ఎన్నిక కావడం వడ్డెర జాతికి గర్వకారణమన్నారు.

ఎన్నో ప్రభుత్వాలు మారినా వడ్డెర జాతికి సరైన గుర్తింపు దక్కలేదని, అయితే ప్రస్తుత ప్రభుత్వం వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్ నియామకం చేపట్టడం అభినందనీయమని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , ఉత్తమ్ కుమార్ రెడ్డి , ప్రభుత్వ విప్ వేముల వీరేశం లకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లపు దుర్గయ్య, మండల అధ్యక్షుడు దండ్ల సమ్మయ్య, పట్టణ అధ్యక్షుడు పల్లపు రవి, వడ్డెర సంఘం నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

వడ్డెర జాతికి గుర్తింపు తీసుకొచ్చిన నాయకురాలు గుంజే రేణుక నారాయణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News