Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
టీఎంజేఎఫ్ మూడవ రాష్ట్ర మహాసభలకు కరపత్రికల ఆవిష్కరణ. ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 02, 2026 05:16 AM

వచ్చే శ్రీరామనవమి నాటికి ‘రామలయానికి’కి కొత్త శోభ..

27-03-2026 78 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

ఆలయ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక..

ఉత్తర ద్వార దర్శనం, వైకుంఠ ద్వారాల ఏర్పాటు..

పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..

నల్గొండ: నల్గొండ పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామగిరి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని వచ్చే ఏడాది శ్రీరామనవమి నాటికి భక్తులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. శుక్రవారం శ్రీరామనవమిని పురస్కరించుకొని రామగిరి ఆలయంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ పక్షాన స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వేలాది మంది భక్తులు దర్శించుకునే ఈ చారిత్రక ఆలయ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ముఖ్యంగా భక్తుల సౌకర్యార్థం వైకుంఠ దర్శనం, ఉత్తర ద్వార దర్శనం వంటి సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. "దర్శన మార్గాల విస్తరణకు అవసరమైన స్థల సేకరణపై ఇప్పటికే చర్చలు జరిగాయి. నెల రోజుల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి వెంటనే పనులు ప్రారంభిస్తాం" అని మంత్రి వివరించారు.దేవాలయ భూములకు ఎలాంటి నష్టం కలగకుండా ఉండేందుకు, నేషనల్ హైవే మార్గాన్ని బైపాస్ ద్వారా మళ్లించినట్లు మంత్రి గుర్తుచేశారు. రామగిరి ఆలయానికి ఉన్న విశిష్ట చరిత్రను కాపాడుతూనే ఆధునిక వసతులు కల్పిస్తామని చెప్పారు. పట్టణ ప్రజలందరూ శ్రీరాముని కృపతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

అండగా ఉంటాం మేయర్..

​నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. మంత్రి సహకారంతో ఆలయ పునర్నిర్మాణ పనులను వేగవంతం చేస్తామని, భక్తులకు కనీస సౌకర్యాల విషయంలో ఎక్కడా రాజీ పడబోమని స్పష్టం చేశారు.​ ఈ వేడుకల్లో స్థానిక సంస్థల అదనపు ఇంచార్జీ కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, జిల్లా పరిషత్ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ పాశం రామ్ రెడ్డితో పాటు పలువురు కార్పొరేటర్లు, వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఆలయ పరిసరాలు 'జై శ్రీరామ్' అంటూ రాముని నామ స్మరణలతో మారుమోగాయి.

Sthanikam

వచ్చే శ్రీరామనవమి నాటికి ‘రామలయానికి’కి కొత్త శోభ..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News