Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:24 PM

ఉరుమడ్లలో ఉచిత హాకీ శిక్షణ శిబిరం ప్రారంభం

01-05-2026 119 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిధిలోని ఉరుమడ్ల గ్రామంలో శుక్రవారం యువజన మరియు క్రీడాశాఖ ఆధ్వర్యంలో వేసవి ఉచిత హాకీ శిక్షణ శిబిరం ప్రారంభమైంది. శిక్షకుడు గంగాపురం రాము ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శిబిరాన్ని గ్రామ సర్పంచ్ సాగర్ల భానుశ్రీ బిక్షం ముఖ్య అతిథిగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ వాడపల్లి రవీందర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు శారీరక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని, క్రమం తప్పకుండా ఆటలు ఆడడం ద్వారా శరీర దృఢత్వం పెరుగుతుందని తెలిపారు. క్రీడల ద్వారా శరీరంలో క్యాలరీలు వినియోగించబడటంతో అనారోగ్య సమస్యలు దూరమవుతాయని చెప్పారు. అలాగే ఒత్తిడి తగ్గి, ఏకాగ్రత మరియు జ్ఞానశక్తి మెరుగుపడతాయని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థిలో లక్ష్య సాధనపై పట్టుదల పెంపొందించడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పొలగోని స్వామి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోనేటి యాదగిరి, జిల్లా కాంగ్రెస్ నాయకుడు పల్లపు బుద్ధుడు, గ్రామ సెక్రటరీ ఉపేందర్, సోషల్ మీడియా ఇన్‌చార్జ్ పట్ల జనార్ధన్, వార్డు సభ్యులు జనపాల శ్రీను, మందుగుల పార్వతమ్మ, మెడబోయిన స్వాతి శ్రీనివాస్, కురుపాటి లింగయ్య, మర్రి రమేష్, బోయ స్వామి, ఉయ్యాల మల్లేష్, జాంగిర్, వ్యాయామ ఉపాధ్యాయులు కొండా పరమేష్, ఎలుగు చంద్రశేఖర్, సాగర్ల లింగస్వామి, సీనియర్ క్రీడాకారులు రాచమల్ల శ్రీను, హరి ప్రసాద్, బొడ్డు శ్రీను, విద్యార్థులు మరియు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఉరుమడ్లలో ఉచిత హాకీ శిక్షణ శిబిరం ప్రారంభం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News