Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 08:25 AM

ఉపాధి హామీ చట్ట రక్షణ కోసం 15న గ్రామీణ సమ్మె కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలి

11-05-2026 71 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వి‌బి-జి రాంజీ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 15న దేశవ్యాప్తంగా నిర్వహించే గ్రామీణ సమ్మెకు సహకరించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పిలుపునిచ్చారు.

ఈ మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి టి. నాగిరెడ్డికి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సమ్మె నోటీసును జిల్లా అధ్యక్షుడు బొల్లు యాదగిరి, ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ, జిల్లా ఉపాధ్యక్షుడు, చీమలకొండూరు సర్పంచ్ పల్లెర్ల అంజయ్య అందజేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ఉపాధి హామీ కార్మికులు కొత్త చట్టాల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జీవోలతో గతంలో ఉన్న అనేక హక్కులు కోల్పోయారని అన్నారు.

పనికి వెళ్లినా ఎంత కూలి వస్తుందో తెలియని పరిస్థితి నెలకొందని, చేసిన పనికి వేతనాలు ఎప్పుడు వస్తాయో తెలియక కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు. పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని, ఉపాధి హామీ కార్మికులకు సంవత్సరానికి 200 రోజుల పని కల్పించి రోజుకు రూ.800 కూలి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

రోజుకు రెండుసార్లు ఫోటోలు తీసే ఈ-కేవైసీ విధానాన్ని రద్దు చేయాలని, పని ప్రదేశాల్లో తాగునీరు, టెంట్లు, మెడికల్ కిట్ వంటి సౌకర్యాలు కల్పించాలని కోరారు. ప్రమాదాలు జరిగితే ఉచిత వైద్యం అందించడంతో పాటు కార్మికులందరికీ బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.

అలాగే పనిముట్లు అందజేయాలని, కేంద్ర ప్రభుత్వం 90 శాతం నిధులు కేటాయించాలని, పట్టణ ప్రాంతాల్లో కూడా ఉపాధి హామీ పనులు అమలు చేయాలని కోరారు. తమ డిమాండ్ల సాధన కోసం మే 15న జరిగే గ్రామీణ సమ్మెలో ఉపాధి హామీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Sthanikam

ఉపాధి హామీ చట్ట రక్షణ కోసం 15న గ్రామీణ సమ్మె కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News