Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 07:16 AM

ఉపాధ్యాయులు శిక్షణ తరగతుల ద్వారా నైపుణ్యం పెంపొందించుకోవాలి

21-01-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram Journalist

విద్యార్థులకు సాంకేతికతతో కూడిన విద్య అందించాలి: జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

సూర్యాపేట స్థానిక ప్రధాన ప్రతినిధి :

ఉపాధ్యాయులు శిక్షణ తరగతుల ద్వారా నూతన సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకొని, విద్యార్థులకు ఆధునిక సాంకేతికతతో కూడిన విద్య అందించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. స్థానిక ఆర్‌ఆర్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో బుధవారం మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలోని NIEPA సంస్థ నిర్వహించిన “ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ ఎంపవరింగ్ కేజీబీవీ వార్డెన్స్” శిక్షణ తరగతులకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాస్టర్ ట్రైనర్స్ ద్వారా ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహించడం వల్ల ఉపాధ్యాయుల్లో నూతన సాంకేతిక నైపుణ్యాలు పెంపొందుతాయని అన్నారు. విద్యార్థులకు సాంకేతిక విద్య, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఆధారిత బోధన అందించే సామర్థ్యం పెరుగుతుందని తెలిపారు.కేజీబీవీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో ఉత్తీర్ణత శాతం ఎక్కువగా ఉండటానికి, ఉపాధ్యాయులు ఎక్కువ సమయం కేటాయించడం, వసతి, భోజన సౌకర్యాలతో విద్యార్థులు ఉపాధ్యాయులతో నిరంతరం మమేకం కావడమే కారణమని పేర్కొన్నారు. శిక్షణ కార్యక్రమంలో పొందిన పరిజ్ఞానాన్ని తిరిగి పాఠశాలలకు వెళ్లిన తర్వాత తోటి ఉపాధ్యాయులకు కూడా పంచాలని సూచించారు. రెసిడెన్షియల్ పాఠశాలలు పోటీపడి కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా అభివృద్ధి చెందాలని, ముఖ్యంగా సైన్స్, మ్యాథ్స్ వంటి సబ్జెక్టుల్లో బోధనా సామర్థ్యాన్ని మరింత పెంచాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులను ఉన్నత విద్యకు సిద్ధం చేసి, గ్రూప్స్, మెయిన్స్, సివిల్స్ వంటి పోటీ పరీక్షలకు పోటీపడే స్థాయికి తీసుకువెళ్లేలా శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ అశోక్, నోడల్ ఆఫీసర్ పూలన్, మాస్టర్ ట్రైనర్స్ నిర్మల జ్యోతి, తవిటి నాయుడు, సూర్య కళ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఉపాధ్యాయులు శిక్షణ తరగతుల ద్వారా నైపుణ్యం పెంపొందించుకోవాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News