Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దేవరకొండలో ఎక్సైజ్ దాడులు.. నాటుసారా గుట్టురట్టు 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 01:52 PM

ఉపాధ్యాయ సమస్యలపై రాజీలేని పోరాటం: టీఎస్ యూటీఎఫ్

ఉపాధ్యాయ సమస్యలపై రాజీలేని పోరాటం: టీఎస్ యూటీఎఫ్

ఉపాధ్యాయ సమస్యలపై రాజీలేని పోరాటం: టీఎస్ యూటీఎఫ్
April 14, 2026 05:16 PM 89 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

రాజ్యాంగ స్ఫూర్తితోనే సంఘాల నిర్మాణం..

ఏప్రిల్ 17న నల్ల బ్యాడ్జీలతో నిరసనలకు పిలుపు..

టీఎస్ యూటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవంలో మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి..


నల్లగొండ : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా 'అధ్యయనం-అధ్యాపనం-సామాజిక స్పృహ' లక్ష్యాలుగా తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (TSUTF) ఆవిర్భవించిందని ఆ సంఘం రాష్ట్ర నేతలు స్పష్టం చేశారు. మంగళవారం నల్లగొండలోని జిల్లా కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం టీఎస్ యూటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా అధ్యక్షుడు బక్క శ్రీనివాస్ చారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉమ్మడి జిల్లా సీనియర్ నాయకులను ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల ఫలితంగానే సంఘాల నిర్మాణం సాధ్యమైందన్నారు. అన్ని కేడర్ల ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం యూటీఎఫ్ నిరంతరం శ్రమిస్తోందని గుర్తు చేశారు. గత నాయకుల త్యాగాల వల్ల నేడు ఉపాధ్యాయ లోకం అనేక ప్రయోజనాలను పొందుతోందని వారి ఉద్యమ స్ఫూర్తిని నేటి యువతరం అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు.

మరో ముఖ్య అతిథి టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి మాట్లాడుతూ 2014 ఏప్రిల్ 13న కేవలం 43 మంది సభ్యులతో ప్రారంభమైన ఈ సంఘం నేడు 40 వేలకు పైగా సభ్యత్వంతో రాష్ట్ర ఉపాధ్యాయ ఉద్యమాన్ని శాసించే స్థాయికి ఎదిగిందని కొనియాడారు.

రాజ్యాంగం విఫలమైతే అది పాలకుల తప్పే తప్ప రాజ్యాంగ లోపం కాదని అంబేద్కర్ చెప్పిన మాటలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత పాలకులు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తూ లౌకికత్వానికి, సమానత్వానికి విఘాతం కలిగిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ తీరుపై మండిపడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని చావ రవి డిమాండ్ చేశారు. పదవీ విరమణ పొందిన వారి పెండింగ్ బిల్లులను ఏకమొత్తంగా చెల్లించాలని తక్షణమే పీఆర్సీని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సమస్యల సాధన కోసం ఉద్యోగ జేఏసీల ఆధ్వర్యంలో ఏప్రిల్ 17న నల్ల రిబ్బన్లతో నిరసనలు, మే 5న జిల్లా స్థాయి ఆందోళనలు నిర్వహిస్తామని ప్రకటించారు. మే 14న తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని అవసరమైతే పెన్ డౌన్ సమ్మెకు సైతం వెనుకాడబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టాప్రా రాష్ట్ర అధ్యక్షుడు పి.కృష్ణమూర్తి, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. రాజశేఖర్ రెడ్డి, కోశాధికారి లక్ష్మారెడ్డి, కార్యదర్శులు పెరుమాళ్ళ వెంకటేశం, సొంబాబు, జిల్లా ఉపాధ్యక్షుడు నర్రా శేఖర్ రెడ్డి, సీనియర్ నాయకులు వి. బంగారయ్య, పి. నాగరాజ్జున, కుకడాల గోవర్ధన్, శాంతి కుమార్, నర్రా సరళ, సుభాషిణి, పద్మ, అరుణ, వేదశ్రీ మరియు వివిధ మండలాల బాధ్యులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News