Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:37 PM

ఉనికి కోసమే ఆరోపణలు – ఉషశ్రీ చరణ్‌పై వెంకటరమణ ఫైర్

28-04-2026 51 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

పెనుకొండ: మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ మంత్రి సవితపై చేస్తున్న ఆరోపణలు ఉనికి కోసం చేస్తున్నవేనని రాష్ట్ర సగర ఉప్పర కార్పొరేషన్ చైర్మన్ వెంకటరమణ తీవ్రంగా విమర్శించారు. అభివృద్ధి చేయలేక, ప్రజల మద్దతు కోల్పోయి ఇప్పుడు వ్యక్తిగత విమర్శలతో రాజకీయంగా నిలబడేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

మంత్రి సవిత నాయకత్వంలో పెనుకొండ నియోజకవర్గంలో జరుగుతున్న వేగవంతమైన అభివృద్ధిని చూసి ఓర్వలేక ఉషశ్రీ చరణ్ విమర్శలు చేస్తున్నారని అన్నారు. ప్రజలు తిరస్కరించినా ఆమె వైఖరిలో మార్పు లేదని విమర్శించారు.

అన్నా క్యాంటీన్ ద్వారా వేలాది పేదలకు ఆహారం అందించిన ఘనత సవితమ్మదేనని, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ 1000 రోజులకు పైగా సేవలు అందించారని గుర్తుచేశారు. రాంపురం అభివృద్ధి, పేద విద్యార్థులకు ఉచిత విద్య కోసం ఎంజేపై స్కూల్ స్థాపన వంటి కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు.

మంత్రిగా ఉన్న ఐదేళ్లలో స్పందించని సమస్యలు ఇప్పుడు గుర్తొస్తున్నాయా అని ప్రశ్నించిన వెంకటరమణ, పరిగి మండలంలోని ఫ్రీ కాట్ మిల్ మూతపడినప్పుడు ఎందుకు స్పందించలేదని నిలదీశారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు సేవ చేయలేని వారు ఇప్పుడు విమర్శలు చేయడం సరికాదన్నారు.

వ్యక్తిగత విమర్శలకు దిగితే తామూ స్పందించగలమని, కానీ ఆ స్థాయికి దిగజారడం తమ సంస్కృతి కాదని హెచ్చరించారు. ఇకపై మంత్రి సవితమ్మపై అనవసర వ్యాఖ్యలు చేస్తే తీవ్రంగా ప్రతిస్పందిస్తామని స్పష్టం చేశారు.

పెనుకొండలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకునేందుకు రాజకీయ ఆరోపణలు చేస్తున్నారని, ప్రజలు వాటిని గమనిస్తున్నారని తెలిపారు. అభివృద్ధి పనులతోనే ప్రజల విశ్వాసం పొందాలని సూచించారు.

Sthanikam

ఉనికి కోసమే ఆరోపణలు – ఉషశ్రీ చరణ్‌పై వెంకటరమణ ఫైర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News