Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 03:45 AM

ఉమ్మడి నల్గొండ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వేముల వీరేశం

15-03-2026 348 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఏకగ్రీవ ఎన్నిక – క్రీడల అభివృద్ధికి కృషి చేస్తానన్న ఎమ్మెల్యే

ఉమ్మడి నల్గొండ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా క్రీడా వర్గాలు, ప్రజాప్రతినిధులు, అసోసియేషన్ సభ్యులు ఆయనకు అభినందనలు తెలియజేశారు.

అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు. జిల్లాలో క్రీడల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని, యువతలో క్రీడా స్పూర్తి పెంపొందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారికి అవసరమైన ప్రోత్సాహం, సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

క్రీడలు యువత శారీరక, మానసిక దృఢత్వానికి ఎంతో దోహదపడతాయని, రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో రాణించే అవకాశాలను కూడా కల్పిస్తాయని చెప్పారు. అసోసియేషన్ సభ్యులందరూ సమన్వయంతో పని చేసి జిల్లాలో క్రీడా రంగాన్ని మరింత అభివృద్ధి పరచాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో అసోసియేషన్ సభ్యులు, క్రీడా ప్రతినిధులు, పలువురు నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

ఉమ్మడి నల్గొండ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వేముల వీరేశం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News