Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా 13వ వార్డు కౌన్సిలర్ గుర్రాల సంతోష శ్రీనివాస్ జన్మదిన వేడుకలు 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 01:27 AM

ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల పట్ల ప్రభుత్వం తీరు దారుణం

ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల పట్ల ప్రభుత్వం తీరు దారుణం

ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల పట్ల ప్రభుత్వం తీరు దారుణం
April 29, 2026 04:03 AM 9 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

ఉద్యోగులు, పెన్షనర్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలి......

విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు రావెళ్ల సీతారామయ్య..

రాష్ట్రంలోని ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అత్యంత దారుణంగా ఉందని తెలంగాణ రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల సంఘం అసోసియేట్ అధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం కోదాడ పట్టణం పెన్షనర్స్ భవనంలో కోదాడ యూనిట్ అధ్యక్షుడు వేనేపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన ఏప్రిల్ నెలలో జరుపుకునే విశ్రాంత ఉద్యోగుల జన్మదిన వేడుకలను సామూహికంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ సుదీర్ఘకాలం ప్రభుత్వానికి సేవలు అందించి విశ్రాంతి తీసుకుంటున్న వారిని ఇబ్బందులకు గురిచేయడం తగదన్నారు. గత 20 ఏళ్ల క్రితం పరిస్థితి చూస్తే ఉద్యోగి రిటైర్ కావడానికి నాలుగు రోజుల ముందే రావాల్సిన అన్ని బకాయిలు చేతికి వచ్చేవి కానీ, నేడు రిటైర్ అయ్యి ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు అందకపోవడం దురదృష్టకరం అని మండిపడ్డారు.

సకాలంలో రిటైర్మెంట్ బకాయిలు అందక ఆర్థిక ఇబ్బందులతో ఎంతోమంది విశ్రాంత ఉద్యోగులు మనోవేదనకు గురవుతున్నారని, ఇది వారి ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్‌లో ఉన్న బకాయిలన్నింటినీ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బొల్లు రాంబాబు, కోదాడ యూనిట్ కార్యదర్శి రఘువర ప్రసాద్, ఆర్థిక కార్యదర్శి తమ్మన బోయిన వీరబాబు, అసోసియేట్ అధ్యక్షులు జానయ్య, గులాం ఎస్దాని, భ్రమరాంబ, బాలేమియా, హాజీ నాయక్, భూపాల్ రెడ్డి, జగన్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు....

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News