Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:24 PM

ఉద్యోగం పేరుతో మోసం – నార్కట్‌పల్లిలో కేసు నమోదు

04-05-2026 162 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండల పరిధిలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి డబ్బులు వసూలు చేసిన మోసం ఘటన వెలుగులోకి వచ్చింది. నకిరేకల్ గ్రామానికి చెందిన కోతోజు నరేంద్ర చారి, అక్కేనపల్లి గ్రామానికి చెందిన ఎస్‌కే జహంగీర్ (తండ్రి నజీర్, వయసు 35) ను MSME అవుట్‌సోర్సింగ్ సంస్థలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.1,04,000 తీసుకున్నాడు.అయితే ఎలాంటి ఉద్యోగం కల్పించకుండా మోసం చేసినట్లు బాధితుడు గుర్తించాడు. అనంతరం డబ్బులు తిరిగి ఇవ్వాలని అడగగా, దేవాదాయ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని మరో రూ.1,00,000 ఇవ్వాలని మళ్లీ మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.ఈ ఘటనపై బాధితుడు నార్కట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు హెచ్చరిక జారీ చేస్తూ, ఉద్యోగాల పేరుతో డబ్బులు అడిగే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద ఘటనలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు.

Sthanikam

ఉద్యోగం పేరుతో మోసం – నార్కట్‌పల్లిలో కేసు నమోదు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News