Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:01 AM

టోకెన్ విధానంలో జొన్నల కొనుగోలు ప్రారంభం

23-05-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు : సొసైటీ చైర్మన్ సిద్ధలింగయ్య స్వామి

న్యాల్కల్ మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రంలో రైతులకు ఎలాంటి ఆటంకం కలగకుండా కొనుగోలు ప్రక్రియ కొనసాగుతోందని సొసైటీ చైర్మన్ సిద్ధలింగయ్య స్వామి తెలిపారు. టోకెన్ విధానంలో రైతుల నుంచి పంటను స్వీకరిస్తూ పారదర్శకంగా కొనుగోలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తమ పంటను శుభ్రంగా, తేమ శాతం నిబంధనలకు అనుగుణంగా తీసుకురావాలని సూచించారు. రైతులు గంటల తరబడి వేచి ఉండకుండా టోకెన్ సిస్టమ్ అమలు చేస్తున్నామని, ప్రతి రైతుకు సమయానికి కొనుగోలు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.కొనుగోలు కేంద్రంలో తాగునీరు, నీడ, తూకం సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రైతులు ఎలాంటి మధ్యవర్తులను నమ్మకుండా నేరుగా కొనుగోలు కేంద్రానికి వచ్చి తమ పంటను విక్రయించాలని సూచించారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో కొనుగోలు ప్రక్రియ సజావుగా కొనసాగుతోందన్నారు.

Sthanikam

టోకెన్ విధానంలో జొన్నల కొనుగోలు ప్రారంభం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News