Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:19 AM

తిరువూరు నియోజకవర్గంలో రైతులకు రూ.19.17 కోట్ల అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ నిధులు జమ

14-03-2026 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని తిరువూరు మండలం మల్లెల గ్రామంలోని పీఏసీఎస్ కార్యాలయంలో శుక్రవారం అన్నదాత సుఖీభవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరువూరు నియోజకవర్గ పరిధిలో 33,658 మంది రైతులకు రూ.13.46 కోట్లు అన్నదాత సుఖీభవ నిధులు, అలాగే 28,518 మంది రైతులకు రూ.5.70 కోట్లు పీఎం కిసాన్ నిధులు జమ అవుతున్నాయని తెలిపారు. మొత్తం కలిపి రూ.19.17 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే వెల్లడించారు.

గత అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ సందర్భంగా రైతుల సమస్యలపై మాట్లాడానని ఆయన తెలిపారు. రైతు అప్పుల్లోనే పుడతాడు, అప్పుల్లోనే జీవిస్తాడు, అప్పుల్లోనే మరణిస్తాడని పేర్కొన్నారు. అంతటి కష్టాలు పడుతూ కూడా రైతు అందరికీ అన్నం పెడుతున్నాడని, రైతుల కష్టం ఎప్పటికీ మరువలేనిదని అన్నారు. అలాంటి కష్టాల్లో ఉన్న రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా అందుతున్న ఆర్థిక సహాయం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు.

ఈ పథకం మూడవ విడతగా రాష్ట్రవ్యాప్తంగా 46.85 లక్షల మంది రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా కలిపి ఒక్కో రైతు ఖాతాలో రూ.6 వేల చొప్పున జమ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మూడో విడత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రూ.2,676 కోట్లు ఖర్చు చేస్తున్నాయని తెలిపారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.1,874 కోట్లు కేటాయించిందన్నారు. ఇప్పటికే రెండు విడతల్లో రైతుల ఖాతాల్లో రూ.14 వేల చొప్పున జమ చేయగా, ఈరోజు జమ చేస్తున్న రూ.6 వేలతో కలిపి రైతులకు ఏడాదికి రూ.20 వేల సాయం అందిస్తున్నామని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, ఎమ్మార్వో, పీఏసీఎస్ చైర్మన్లు, గ్రామ నాయకులు, రైతులు మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

తిరువూరు నియోజకవర్గంలో రైతులకు రూ.19.17 కోట్ల అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ నిధులు జమ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News