Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:51 AM

తక్కువ ధరకే మంచి భోజనం… ప్రజలతో ముచ్చటించిన మంత్రి సవిత

02-05-2026 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ క్యాంటీన్‌ను రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు సవిత పరిశీలించారు. ఈ సందర్భంగా క్యాంటీన్‌లో అందిస్తున్న భోజన నాణ్యత, పరిశుభ్రత, సదుపాయాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

తదుపరి మంత్రి స్వయంగా క్యాంటీన్‌లో భోజనం చేసి, అక్కడ భోజనం చేస్తున్న ప్రజలతో ముచ్చటించారు. భోజనం రుచి, నాణ్యతపై ప్రశ్నించగా, ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం రూ.5కే కడుపు నిండా భోజనం అందుతున్నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

మంత్రి సవిత మాట్లాడుతూ, పేద మరియు మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన ఆహారం అందించడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఇలాంటి క్యాంటీన్లు ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయని తెలిపారు. సేవల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని, నాణ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.

Sthanikam

తక్కువ ధరకే మంచి భోజనం… ప్రజలతో ముచ్చటించిన మంత్రి సవిత

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News