Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బీఎల్ఓ యాప్‌లో వివరాలు తప్పుల్లేకుండా నమోదు చేయాలి. ఓటరు జాబితా సవరణలో పారదర్శకత పాటించాలి: కలెక్టర్ నారాయణరెడ్డి 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 08:18 PM

తడిసిన ప్రతి గింజను కొనాలి - జోకిన ధాన్యాన్ని వెంటనే తరలించాలి: బూరుగు కృష్ణారెడ్డి

తడిసిన ప్రతి గింజను కొనాలి - జోకిన ధాన్యాన్ని వెంటనే తరలించాలి: బూరుగు కృష్ణారెడ్డి

తడిసిన ప్రతి గింజను కొనాలి - జోకిన ధాన్యాన్ని వెంటనే తరలించాలి: బూరుగు కృష్ణారెడ్డి
May 11, 2026 06:32 PM 66 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

తడిసిన ప్రతి వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని, మార్కెట్ యార్డుల్లో జోకిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ఎదుట రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి నెల రోజులు గడుస్తున్నా ధాన్యం తరలింపులో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. తూకాలు, తాలు పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం ధాన్యం కొంటుందనే ఆశతో రైతులు వందల క్వింటాళ్ల ధాన్యాన్ని మార్కెట్ యార్డులకు తీసుకువచ్చి పోస్తే, ఆదివారం కురిసిన అకాల వర్షాలకు ధాన్యం తడిసి ముద్దయిందన్నారు.

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా అధికారులు రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిల్లర్లతో సమన్వయం చేసుకుని ధాన్యాన్ని వేగంగా మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అవసరమైన చోట హమాలీల సంఖ్య పెంచడంతో పాటు అదనపు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు తీసుకొచ్చిన ధాన్యం కల్లాల్లో ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా త్వరితగతిన కొనుగోళ్లు పూర్తి చేయాలని, ధాన్యం అమ్మిన రైతులకు సకాలంలో చెల్లింపులు చేయాలని సూచించారు. అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని, ధాన్యం ఎక్కువగా ఉన్న కేంద్రాలకు లారీలు పంపించాలని కోరారు.

పది రోజుల్లో మార్కెట్ యార్డుల్లోని ధాన్యాన్ని తరలించకపోతే రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు చీర్క అలివేలు, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా, సిపిఎం పార్టీ మున్సిపల్ కార్యదర్శి గోశిక కరుణాకర్, బండారు నరసింహ, రైతు సంఘం నాయకులు ఆకుల ధర్మయ్య, పర్ని ధర్మారెడ్డి, బొడ్డు అంజిరెడ్డి, పొట్ట శ్రీను, బొజ్జ బాలయ్య, జక్కిడి గోపాల్ రెడ్డి, అంజిరెడ్డి, చీర్క సంజీవరెడ్డి, పడమటి కృష్ణారెడ్డి, లింగయ్య, కృష్ణ, సప్పిడి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News