Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్‌ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు....... ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 02, 2026 11:04 AM

టీయూడబ్ల్యూజే (ఐజేయూ)లో టీఎస్‌జేఏ విలీనం

23-05-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తాం : చలసాని శ్రీనివాసరావు

తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఐజేయూ)లో తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ (టీఎస్‌జేఏ) శనివారం విలీనం అయింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యుడు , రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు , జిల్లా అధ్యక్షుడు కోల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి డాక్టర్ కృష్ణ బంటు ఆధ్వర్యంలో టీఎస్‌జేఏ సభ్యులు టీయూడబ్ల్యూజే (ఐజేయూ)లో సభ్యత్వం స్వీకరించారు.

ఈ సందర్భంగా టీఎస్‌జేఏ వ్యవస్థాపక అధ్యక్షుడు ను చలసాని శ్రీనివాసరావు శాలువాతో సత్కరించి యూనియన్‌లోకి ఆహ్వానించారు.

సమావేశంలో చలసాని శ్రీనివాసరావు మాట్లాడుతూ, జర్నలిస్టుల సంక్షేమం కోసం టీయూడబ్ల్యూజే (ఐజేయూ) నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు అన్ని వర్కింగ్ జర్నలిస్టులకు వర్తించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. టీఎస్‌జేఏ వంటి సంఘం విలీనం కావడం స్వాగతించదగ్గ పరిణామమని, కొత్తగా చేరిన సభ్యులకు తగిన ప్రాధాన్యం కల్పిస్తామని పేర్కొన్నారు.

సీనియర్ జర్నలిస్టు కందుకూరి యాదగిరి మాట్లాడుతూ, తమ అసోసియేషన్‌లోని సభ్యులు అందరూ ఒకే వేదికపైకి రావడం హర్షణీయమన్నారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం కలిసి పనిచేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు దుస్స చంద్రశేఖర్, గుంటి శ్రీనివాస్, మహమ్మద్ గౌస్, కొరివి సతీష్ యాదవ్, సందీప్, యాతాకుల మధుసూదన్, అబ్దుల్ అజీజ్ తదితరులు సభ్యత్వం స్వీకరించారు.

జిల్లా వ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని, గ్రామీణ విలేకరులకు అండగా నిలుస్తామని నాయకులు తెలిపారు. అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డులు అందించే దిశగా కృషి చేస్తామని పేర్కొన్నారు.

Sthanikam

టీయూడబ్ల్యూజే (ఐజేయూ)లో టీఎస్‌జేఏ విలీనం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News