Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:42 AM

తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమ్మె 8వ రోజుకు చేరింది – నల్గొండలో ఉద్రిక్తత

15-04-2026 39 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ పట్టణ కేంద్రంలో విద్యుత్ శాఖ ఆర్టిజన్ కార్మికుల నిరవధిక సమ్మె 8వ రోజుకు చేరుకుంది. ఎనిమిది రోజులుగా సమ్మెలో కొనసాగుతున్నప్పటికీ యాజమాన్యం చర్చలకు పిలవకపోవడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

“విధుల నుండి తొలగిస్తామని బెదిరించినా, మా హక్కులు సాధించే వరకు వెనక్కి తగ్గేది లేదు” అని కార్మికులు స్పష్టం చేశారు.

ఆర్టిజన్ కార్మికుల ఉద్యమంలో భాగంగా నల్గొండ సర్కిల్ కార్యాలయం ముందు 8వ రోజు కూడా సమ్మె కొనసాగించారు. కార్మికులు తమ ప్రధాన డిమాండ్లను మరోసారి స్పష్టం చేశారు.

ప్రధాన డిమాండ్లు:

విద్యార్హత ఆధారంగా ఆర్టిజన్ కార్మికులందరినీ కన్వర్షన్ చేయాలి

ఉన్న ఆర్టిజన్ ఉద్యోగులందరికీ APSEB రూల్స్ అమలు చేయాలి

UnManned వర్కర్లందరినీ సంస్థలో విలీనం చేయాలి

మిగిలిన కార్మికులందరినీ సంస్థలో విలీనం చేయాలి

పీస్ రేట్ వర్కర్లకు కనీస వేతన చట్టం అమలు చేయాలి

PRC-2026 అమలు చేయాలి

ఈ సమ్మె 08-04-2026 నుండి నిరవధికంగా కొనసాగుతోంది. రాష్ట్ర స్థాయిలో ట్రేడ్ యూనియన్లు, అసోసియేషన్ నాయకులతో ఆర్టిజన్ జాయింట్ యాక్షన్ కమిటీ చర్చలు జరిపినప్పటికీ, ప్రభుత్వం తరఫున “ముందుగా విధుల్లో చేరండి, తర్వాత సమస్యలు పరిష్కరిస్తాం” అనే ప్రతిపాదనను ఆర్టిజన్ నాయకులు తిరస్కరించారు.

రేపటికీ సమ్మె కొనసాగించాలని వారు నిర్ణయించారు. ప్రభుత్వం, యాజమాన్యం వెంటనే చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

పాల్గొన్న నాయకులు:

ఈ కార్యక్రమానికి మద్దతుగా జిల్లా జేఏసీ నాయకులు లింగస్వామి, కన్వీనర్ మద్ది శ్రీనివాస్, డి. రమేష్, వేణుగోపాల్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, శ్రీపతి రమేష్, అద్దంకి వెంకన్న, లింగారెడ్డి, మల్లేష్, విజయ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమ్మె 8వ రోజుకు చేరింది – నల్గొండలో ఉద్రిక్తత

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News