Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిట్యాల మండలానికి కొత్త ఎంపీడీవోగా జె. పాండు బాధ్యతల స్వీకరణ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 02:03 PM

టీడీపీ నూతన కార్యాలయానికి భూమిపూజ

టీడీపీ నూతన కార్యాలయానికి భూమిపూజ

టీడీపీ నూతన కార్యాలయానికి భూమిపూజ
May 06, 2026 03:44 PM 22 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

: కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయ నిర్మాణానికి బుధవారం భూమిపూజ నిర్వహించారు. కర్నూలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ ఆధ్వర్యంలో నగరంలోని సి క్యాంప్ సెంటర్ సమీపంలో ఆర్ అండ్ బి కార్యాలయం పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్, ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ పాల్గొన్నారు. అలాగే నియోజకవర్గ ఇన్‌చార్జీలు కే మీనాక్షి నాయుడు (ఆదోని), వైకుంఠం జ్యోతి (ఆలూరు), ఎన్ రాఘవేంద్రరెడ్డి (మంత్రాలయం), కూడ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, వివిధ కార్పొరేషన్ల చైర్‌పర్సన్లు, చైర్మన్లు, జిల్లా స్థాయి నాయకులు, పార్టీ కార్యదర్శులు, డైరెక్టర్లు తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా గుడిసె ఆది కృష్ణమ్మ మాట్లాడుతూ, పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ మరియు పార్టీ పెద్దల సహకారంతో నూతన కార్యాలయ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి, పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందుబాటులోకి తీసుకురావనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News