Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 04:04 AM

టీచర్ల పనితీరుపై ఐదేళ్లకోసారి పరీక్ష.. ఫెయిలైతే ఇంటికే..!!

28-02-2026 136 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

విద్యా వ్యవస్థలో సంచలన మార్పులకు విద్యా కమిషన్ ప్రతిపాదనలు

రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను పెంచే దిశగా విద్యా కమిషన్ కీలక సిఫారసులు చేసింది. కొత్తగా నియామకమయ్యే ఉపాధ్యాయులకు ప్రతి ఐదేళ్లకోసారి పనితీరు పరీక్ష తప్పనిసరి చేయాలని సూచించింది. పనితీరు సరిగా లేని వారిని సేవల నుంచి తప్పించాలనే ప్రతిపాదన కూడా చేసింది.విద్యార్థుల అభ్యసన ఫలితాలకు అరవై శాతం ప్రాధాన్యం ఇవ్వాలని కమిషన్ సూచించింది. మిగిలిన శాతం ఉపాధ్యాయుల బోధన సామర్థ్యం, పాఠశాల హాజరు, బాధ్యత నిర్వహణ వంటి అంశాల ఆధారంగా నిర్ణయించాలన్నారు. విద్యార్థుల ఫలితాల్లో స్పష్టమైన మెరుగుదల కనిపించకపోతే సంబంధిత ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

ఈ నిబంధనలు ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కాకుండా కొత్త నియామకాలకే వర్తిస్తాయని కమిషన్ స్పష్టం చేసింది. నియామకాలను మండల యూనిట్‌గా నిర్వహించాలని, బదిలీ విధానాన్ని రద్దు చేయాలని సూచించింది. ఉపాధ్యాయుల పదవీ పేర్లలో కూడా మార్పులు చేయాలని ప్రతిపాదించింది. విద్యా నాణ్యత పెంపే ప్రధాన లక్ష్యమని, పాఠశాలల్లో బాధ్యతాయుత బోధనకు ఈ మార్పులు దోహదపడతాయని కమిషన్ అభిప్రాయపడింది. ప్రభుత్వ స్థాయిలో ఈ సిఫారసులపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.

Sthanikam

టీచర్ల పనితీరుపై ఐదేళ్లకోసారి పరీక్ష.. ఫెయిలైతే ఇంటికే..!!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News