Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:26 PM

ట్యాబ్ ఎంట్రీలు వెంటనే పూర్తి చేయాలి: కలెక్టర్ ఆదేశాలు

30-04-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

జిల్లాలో రబీ ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. గురువారం రాత్రి కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో రైస్ మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల ఇంచార్జులు, పౌర సరఫరాల అధికారులు పాల్గొన్నారు. కొనుగోలు చేసిన ధాన్య వివరాలను వెంటనే ట్యాబ్‌లలో నమోదు చేసి ఓపీఎంఎస్‌లో అప్లోడ్ చేయాలని ఆయన స్పష్టం చేశారు.జిల్లాలో ఇప్పటివరకు రూ.571 కోట్ల విలువైన 2.39 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. ట్యాబ్ ఎంట్రీలు ఆలస్యమవడంతో రైతులకు చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందని, ఎప్పటికప్పుడు డేటా అప్డేట్ చేస్తేనే నగదు చెల్లింపులు సాధ్యమవుతాయని చెప్పారు. ఈ బాధ్యత కొనుగోలు కేంద్రాల ఇంచార్జులు, మిల్లర్లపై ఉందని పేర్కొన్నారు.

మిల్లర్ల నుండి అంగీకార పత్రం వచ్చిన వెంటనే ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలని, వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ధాన్యాన్ని కామన్, ఏ-గ్రేడ్‌గా వర్గీకరించాలని సూచించారు. కొన్ని చోట్ల అంగీకార పత్రాలు సేకరించకపోవడం, ఓపీఎంఎస్‌లో నమోదు చేయకపోవడం వంటి సమస్యలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

ట్రక్ షీట్ జనరేషన్ పెంచాలని, మే 1 లోపు జిల్లాలోని అన్ని ట్యాబ్ ఎంట్రీలు పూర్తి చేయాలని ఆదేశించారు. మిల్లర్లు లారీలను ఆలస్యం చేయకుండా ధాన్యాన్ని వెంటనే అన్‌లోడ్ చేయాలని, లేకపోతే సమస్యలు పెరుగుతాయని హెచ్చరించారు. రైతులకు త్వరితగతిన చెల్లింపులు జరగాలంటే అందరూ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.

Sthanikam

ట్యాబ్ ఎంట్రీలు వెంటనే పూర్తి చేయాలి: కలెక్టర్ ఆదేశాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News