Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:25 PM

ట్రాక్ షీట్ జాప్యంతో రైతులకు చెల్లింపుల కష్టాలు

08-06-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

ఓటీపీ కోసం ఎదురుచూపులు.. ఖాతాల్లోకి రాని ధాన్యం డబ్బులు

ఆరుగాలం శ్రమించి పండించిన వరి ధాన్యాన్ని విక్రయించిన రైతులు ఇప్పుడు తమ కష్టార్జిత డబ్బుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. గత నెల 29న పెద్దకాపర్తి PACS కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యం లోడింగ్, అన్‌లోడింగ్ ప్రక్రియ పూర్తయినా, ఇప్పటి వరకు ట్రాక్ షీట్‌ను ఆన్‌లైన్‌లో నమోదు చేయకపోవడంతో వందలాది మంది రైతుల ఖాతాల్లో చెల్లింపులు జమ కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ధాన్యం విక్రయించి పది రోజులకు పైగా గడిచినా చెల్లింపులు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు వరికోత యంత్రాల యజమానులు, ట్రాక్టర్ నిర్వాహకులు, ఎరువుల దుకాణాల యజమానులు, ధాన్యం ఆరబోసిన కూలీలు, పట్టాలు ఇచ్చిన వారి బకాయిలు చెల్లించాల్సి ఉండగా చేతికి డబ్బులు అందక రైతులు ఆందోళన చెందుతున్నారు.

అప్పులు చేసి పంట సాగు చేసిన రైతులు ధాన్యం అమ్మిన తర్వాత వచ్చిన మొత్తంతో అప్పులు తీర్చుకోవాలని భావించినా, చెల్లింపుల జాప్యం వారి ఆశలను నీరుగారుస్తోందని పేర్కొంటున్నారు. మరోవైపు తదుపరి పంటల సాగుకు సన్నాహాలు చేయాల్సిన సమయంలో నిధుల కొరత తీవ్రంగా వేధిస్తోందని వాపోతున్నారు.పెద్దకాపర్తి PACS కేంద్రం అధికారుల నిర్లక్ష్యమే ఈ పరిస్థితికి కారణమని రైతులు ఆరోపిస్తున్నారు. ట్రాక్ షీట్ ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తి చేయడానికి అవసరమైన ఓటీపీ కోసం ఎదురుచూస్తున్నామని, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పెండింగ్ ప్రక్రియను పూర్తి చేసి రైతుల ఖాతాల్లో చెల్లింపులు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

"పంట పండించడం కంటే అమ్మిన ధాన్యానికి డబ్బులు రావడమే ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది" అంటూ పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల తక్షణ జోక్యంతో సమస్య పరిష్కారమవుతుందనే ఆశతో అన్నదాతలు ఎదురుచూస్తున్నారు.

Sthanikam

ట్రాక్ షీట్ జాప్యంతో రైతులకు చెల్లింపుల కష్టాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News