Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:15 AM

సూపరింటెండెంట్ లావణ్యకు ఘన సన్మానం

సూపరింటెండెంట్ లావణ్యకు ఘన సన్మానం

సూపరింటెండెంట్ లావణ్యకు ఘన సన్మానం
02-05-2026 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హయత్‌నగర్, : ప్రభుత్వ డిగ్రీ కళాశాల హయత్‌నగర్‌లో ఆఫీస్ సూపరింటెండెంట్‌గా పనిచేసిన ఎ. లావణ్య రెడ్డి స్వచ్ఛంద పదవీ విరమణ పొందిన సందర్భంగా శనివారం కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ పి. సురేష్ బాబు మాట్లాడుతూ, చిన్న వయసులోనే ఉద్యోగంలో చేరి అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత స్థాయికి చేరుకోవడం లావణ్యకు ప్రత్యేకతని తెలిపారు. కుటుంబ అవసరాల నేపథ్యంలో అమెరికాలో ఉన్న భర్త, పిల్లలతో కలవడానికి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకోవడం ఆమె త్యాగానికి నిదర్శనమని అన్నారు.

కళాశాలలో పనిచేసిన కాలంలో అందరితో సాన్నిహిత్యం పెంచుకుని, సేవాభావంతో పనిచేసిన విధానాన్ని సిబ్బంది కొనియాడారు. ఆమెను శాలువాలు, పుష్పగుచ్చాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ ఇందిర, స్టాఫ్ క్లబ్ సెక్రటరీ డా. సుబ్రమణ్యం, అకాడమిక్ కోఆర్డినేటర్ డా. బి. నరసింహ, అధ్యాపకులు, సిబ్బంది, పూర్వ సహచరులు పాల్గొన్నారు.

Sthanikam

సూపరింటెండెంట్ లావణ్యకు ఘన సన్మానం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News