Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:36 AM

సోమందేపల్లిలో అంబేద్కర్ జయంతి ఘనంగా

సోమందేపల్లిలో అంబేద్కర్ జయంతి ఘనంగా

సోమందేపల్లిలో అంబేద్కర్ జయంతి ఘనంగా
14-04-2026 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Somandepalli
Prakash

సోమందేపల్లి,

“అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం.. మహనీయుని అడుగుజాడల్లో నడుద్దాం” అనే నినాదంతో భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 136వ జయంతిని సోమందేపల్లి మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, భారత రాజ్యాంగాన్ని రూపుదిద్దిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ బడుగు, బలహీన వర్గాలకు సమాన హక్కులు కల్పించిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఆయన రూపొందించిన రాజ్యాంగ సూత్రాల ఆధారంగానే దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తున్నాయని తెలిపారు.

అయితే, రాజ్యాంగంలో పొందుపరిచిన కొన్ని చట్టాలను అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సమానత్వం, సామాజిక న్యాయం సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ కార్యవర్గ సభ్యులు బాలస్వామి, మండల కార్యదర్శి రాజగోపాల్ యాదవ్, జిల్లా కౌన్సిల్ సభ్యులు శిలా నారాయణస్వామి, పార్టీ సభ్యులు నరసింహమూర్తి యాదవ్, చంద్రశేఖర్, శ్రీకాంత్, బాబాజాన్, ఆంజనేయులు, మహిళా సమాఖ్య జిల్లా నాయకులు అంజనమ్మ, నూర్జాన్, బేబీ, రామాంజనమ్మ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సోమందేపల్లిలో అంబేద్కర్ జయంతి ఘనంగా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News