Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 01:21 PM

సంక్రాంతి పండుగలో బోరంచ గ్రామంలో ఘనంగా వాలీబాల్ టోర్నమెంట్

14-01-2026 117 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ :సంక్రాంతి పండుగను ఉత్సాహభరితంగా జరుపుకోవడానికి నారాయణఖేడ్ నియోజకవర్గం, మానూర్ మండలం పరిధిలోని బోరంచ గ్రామంలో ఈసారి శ్రీ నల్లపోచమ్మ తల్లి గ్రామస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించబడింది. ఈ టోర్నమెంట్ రెండు రోజుల పాటు సాగి, గ్రామంలోని యువత,యువకులు,పెద్దలు, మరియు ఇతర గ్రామస్థులందరినీ క్రీడాభిరుచి, స్నేహసంబంధాలను పెంపొందించడానికి సానుకూల వేదికగా నిలిచింది.టోర్నమెంట్ నిర్వహణలో రోషన్ ఎర్త్ మోవర్స్ బి మతీన్, శ్రీ నల్లపోచమ్మ తల్లి టెంట్ హౌస్ బి పండరి, ఎమ్ ఎస్ డి చిట్ ఫండ్స్ జి హనుమంతు, జి.ఆర్ ఎడ్యుకేషనల్ లోన్స్ జి రాజు, ఎమ్ వీ ఎస్ మానూర్ ఎండి ఇస్మాయిల్, బసవంజలి వాటర్ ప్లాంట్ ఎమ్ నాగేష్, ఎమ్ ఆర్. బార్బర్ ఎమ్ లక్ష్మణ్, శ్రీ నల్లపోచమ్మ తల్లి టిఫిన్ సెంటర్ ఎస్ రాజు, శ్రీ రాఘవేంద్ర దాబా ఎస్ సంగారెడ్డి తదితరులు ప్రధానంగా సహకరించారు.రెండు రోజుల పాటు కొనసాగిన వాలీబాల్ పోటీలలో ఎమ్ ఎస్ డి చిట్ ఫండ్స్ జి హనుమంతు టీమ్ మొదటి బహుమతి పొందగా,శ్రీ నల్లపోచమ్మ తల్లి టెంట్ హౌస్ బి పండరి టీమ్ రెండో బహుమతిని సొంతం చేసుకుంది.గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, గ్రామ వార్డు మెంబర్లు,గ్రామ పెద్దలు, యువత, యువకులు మరియు ఇతర గ్రామస్థులు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని, స్ఫూర్తిదాయకంగా ఉత్సవాన్ని విజయవంతం చేశారు.శ్రీ నల్లపోచమ్మ తల్లి గ్రామస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వాహకులు మాట్లాడుతూ, గ్రామ పెద్దలు, యువత, యువకులు మరియు గ్రామస్తులు పాల్గొని కార్యక్రమాన్ని సఫలమైనదిగా తీర్చిదిద్దినందుకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమం ద్వారా గ్రామంలో క్రీడా చైతన్యం పెరిగి, యువతలో స్పూర్తి, సమూహ సహకారం మరియు సామూహిక ఉత్సాహం అభివృద్ధి చెందడం జరిగింది.

Sthanikam

సంక్రాంతి పండుగలో బోరంచ గ్రామంలో ఘనంగా వాలీబాల్ టోర్నమెంట్

Article Image

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News