Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:18 AM

సిరిపురంలో సిపిఎం బాసట – నరసింహ కుటుంబానికి ₹50 వేల సాయం

05-05-2026 73 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్న పేట మండలంలోని సిరిపురం గ్రామానికి చెందిన సిపిఎం నాయకుడు దోమలపల్లి నరసింహ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా, ఆయన కుటుంబానికి సిపిఎం గ్రామ శాఖ అండగా నిలిచింది. పార్టీ తరఫున నరసింహ కుటుంబానికి ₹50 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు.

ఈ మొత్తాన్ని నరసింహ భార్య పేరుపై ఫిక్స్డ్ డిపాజిట్ చేసి చెక్కును రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి చేతుల మీదుగా అందించారు. నరసింహ మరణించిన రోజున అంత్యక్రియల ఖర్చులను కూడా పార్టీ గ్రామ శాఖ భరించింది.

ఈ సందర్భంగా మేక అశోక్ రెడ్డి మాట్లాడుతూ, దోమలపల్లి నరసింహ పార్టీ మరియు ప్రజాసంఘాల ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారని, ప్రజల సమస్యలపై ఎప్పుడూ ముందుండేవారని గుర్తుచేశారు. కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు బల్గూరి అంజయ్య, శాఖ కార్యదర్శి అంబటి మల్లారెడ్డి, మాజీ ఎంపీటీసీ బడుగు రమేష్, మాజీ సర్పంచ్ మిరియాల భాస్కర్, నాయకులు కూనూరు వెంకటేశం, మోటే స్వామి, కూనూరు గణేష్, బైరెడ్డి మధుసూదన్ రెడ్డి, సిల్వేరు రాజు, మార్త భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే నరసింహ కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు.

Sthanikam

సిరిపురంలో సిపిఎం బాసట – నరసింహ కుటుంబానికి ₹50 వేల సాయం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News