Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:37 AM

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కాలనీ ఫేస్-I లో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలు.

19-02-2026 102 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

​ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ సర్పంచ్ కారింగుల శంకర్ గౌడ్, అడ్మిన్ ఎస్ఐ రాము నాయక్

జవహర్ నగర్ సర్కిల్ పరిధిలోని చంద్రపురి కాలనీ (డివిజన్ 2), శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కాలనీ ఫేస్-I వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు, స్థానికులు ఘనంగా నివాళులర్పించారు.

​ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ సర్పంచ్ కారింగుల శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. ఛత్రపతి శివాజీ ధైర్యసాహసాలు, దేశభక్తి నేటి యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. హిందూ స్వరాజ్య స్థాపన కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమని కొనియాడారు.

​జవహర్ నగర్ అడ్మిన్ ఎస్ఐ రాము నాయక్ మాట్లాడుతూ.. మహనీయుల జయంతి వేడుకలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవడం సంతోషకరమని అన్నారు. యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా, శివాజీ వంటి వీరుల స్ఫూర్తితో సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. అనంతరం రంగుల హరి మాట్లాడుతూ.. శివాజీ మహారాజ్ కేవలం ఒక రాజు మాత్రమే కాదని, ధర్మాన్ని రక్షించిన గొప్ప వీరుడని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ పుణికిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు.

​పాల్గొన్న ప్రముఖులు: పాల్గొన్న వారు

​ఈ కార్యక్రమంలో బూడిద వెంకటేష్, బాచుపల్లి రమేష్, మరియు మీడియా ప్రతినిధులు వ్యవస్థ న్యూస్ ఛానల్ సీఈఓ అంబాల విష్ణు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

​సేవా దృక్పథంతో అన్నదానం:

​శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని అసోసియేషన్ సభ్యులు భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వందలాది మంది భక్తులు, కాలనీవాసులు ఈ ప్రసాదాన్ని స్వీకరించారు. పేదలకు సేవ చేయడమే శివాజీ మహారాజ్‌కు ఇచ్చే నిజమైన గౌరవమని నిర్వాహకులు పేర్కొన్నారు.

​ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు మరియు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు:

​అధ్యక్షుడు: ఆర్.సి. శ్రీకాంత్

​జనరల్ సెక్రటరీ: కుమ్మరి కృష్ణ

​కోశాధికారి: కత్తెర్ల కిరణ్ యాదవ్

​వర్కింగ్ ప్రెసిడెంట్స్: మూకర రవి, రంగుల హరికృష్ణ

​గౌరవ అధ్యక్షులు: ఎం. లక్ష్మీనారాయణ

​ఉపాధ్యక్షులు: రంగుల శంకర్

​ఆర్గనైజింగ్ సెక్రటరీస్: కొండ్రాతి నరేష్, కోటగిరి సంతోష్ కుమార్

​కార్యదర్శులు: గరడ్ మహిపత్రావు దత్త, చిక్క రఘు, కెమ్మసరం నగేష్

​సహాయ కార్యదర్శులు: కెమ్మసరం సుజాత, మన్నె జ్యోతి, టి. సుజాత

​గౌరవ సలహాదారులు: సిల్వేరి శ్రీకాంత్, కెమ్మసరం చంద్రయ్య, పండుగ సతీష్ యాదవ్

​ఈ వేడుకలో కార్యవర్గ సభ్యులు సి.హెచ్. బస్వరాజు, ఎర్ర వెంకటేష్, ఎం. వంశీ, వై. మహేందర్, చట్టు చిరంజీవి, తన్నీరు నాగరాజు, కుంచాల నవీన్ కుమార్, మిత్రా గౌతమ్, ఏ. నాగచారి, ఆర్. చిత్తారి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కాలనీ ఫేస్-I లో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలు.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News