Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:38 AM

శ్రీ ఆండాళ్ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.

02-03-2026 160 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం.

రాజన్న సిరిసిల్ల జిల్లా, ముస్తాబాద్ మండల పరిధిలోని గూడెం గ్రామంలోని

శ్రీ ఆండాళ్, పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలకు సోమవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. అంకురార్పణం సందర్భంగా రాత్రి పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం అనంతరం శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ శాశ్వత చైర్మన్ చిట్నేని వెంకటేశ్వరరావు, ఆలయ అధ్యక్షులు బి బాలమల్లు, ప్రధాన కార్యదర్శి తాండ్రగిరి రావు లు మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాల నుండి ఆలయ బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నాము ఇందులో భాగంగా ఈ సంవత్సరం ఏడవ వార్షికోత్సవమును ఈనెల 2 నుండి 7 వరకు అత్యంత వైభవంగా నిర్వహించుటకు అన్ని ఏర్పాటు చేశామని అన్నారు.

బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు మంగళవారం ధ్వజారోహణంతో శ్రీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఉదయం ధ్వజారోహణ ఘట్టాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తాము అని తెలిపారు. రెండవ రోజు బుధవారం ఉదయం అష్టోత్తర శతకలశాభిషేకం, సాయంత్రం ఎదుర్కోళ్ళ ఉత్సవము, దీపోత్సవము, మూడవ రోజు గురువారం ఉదయం 10 : 30 నిలకు శ్రీ ఆండాళ్, పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవము, నాలుగవ రోజు శుక్రవారం రాత్రి రథోత్సవము, ఐదవ రోజు శనివారం ఉదయం చక్రస్నానము, రాత్రి ద్వజ అవరోహణము తో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని కావున పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, పాలక మండలి సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Sthanikam

శ్రీ ఆండాళ్ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News