Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:16 AM

సీనియర్ సిటిజన్స్ యాక్ట్ అమలు చేయాలి: ఆర్డీవోకు వినతి

04-05-2026 59 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రజావాణిలో తొలి దరఖాస్తు – సానుకూల స్పందన

సీనియర్ సిటిజన్స్ యాక్ట్–2007ను జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్ ఆర్డీవో కృష్ణారెడ్డిని కోరారు. సోమవారం భువనగిరి రెవెన్యూ అధికార కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో తొలి దరఖాస్తుగా ఆయన వినతి సమర్పించారు.

ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ, వృద్ధులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగలేక ఇబ్బందులు పడుతున్నారని, కుటుంబ సభ్యుల ఆదరణ లేక బాధలు అనుభవిస్తున్నారని చెప్పారు. ఆర్డీవో ఇచ్చే ఆదేశాలను అమలు చేయని వారిపై పోలీసులతో కేసులు నమోదు చేయాలని కోరారు. అలాగే ప్రతి రెండు నెలలకు ఒకసారి సమీక్ష సమావేశాలు నిర్వహించి, పెండింగ్ కేసులు లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.

ఆర్డీవో కృష్ణారెడ్డి సానుకూలంగా స్పందిస్తూ, క్రమం తప్పకుండా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. ఆదేశాలు అమలు కాకపోతే మండల తహసీల్దార్ లేదా ఎస్‌హెచ్‌ఓకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రజావాణిలో తొలి దరఖాస్తు సమర్పించిన వెంకటేష్‌ను అభినందించారు.

ఈ కార్యక్రమంలో డీఏఓ రాధా, తహసీల్దార్లు జగన్, శ్యాం సుందర్ రెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డా. సుమన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సీనియర్ సిటిజన్స్ యాక్ట్ అమలు చేయాలి: ఆర్డీవోకు వినతి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News