Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:21 AM

సీలింగ్ భూముల కబ్జాపై విచారణ లేకపోతే ఉద్యమం బీఆర్‌ఎస్ నేత కర్రె వెంకటయ్య

02-05-2026 45 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆలేరు, : సీలింగ్ భూముల కబ్జాపై సమగ్ర విచారణ జరపకపోతే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని బీఆర్‌ఎస్ పార్టీ మాజీ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య హెచ్చరించారు. శనివారం పట్టణంలో మీడియాతో మాట్లాడారు.

మండలంలోని సైదాపురం, మాసాయిపేట గ్రామాల్లో సర్వే నంబర్లు 322, 728ల పరిధిలో ఉన్న సుమారు 1200 ఎకరాల ప్రభుత్వ సీలింగ్ భూమిని స్థానిక ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అక్రమంగా వెంచర్‌గా అభివృద్ధి చేశారని ఆరోపించారు. నిరుపేదలకు ప్లాట్లు కేటాయించినప్పటికీ వాటి స్థితి స్పష్టంగా లేదని తెలిపారు. ఒక్కో ప్లాట్‌ను పలువురికి రిజిస్ట్రేషన్ చేసిన ఘటనలూ ఉన్నాయని పేర్కొన్నారు.

ఈ అంశంపై రెండు వారాల క్రితం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ వెంకారెడ్డికి ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు విచారణ జరగలేదని విమర్శించారు. అధికార యంత్రాంగం స్పందించకపోతే కలెక్టరేట్ ముట్టడితో పాటు నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో దీక్షలు చేపడతామని హెచ్చరించారు.

అలాగే ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్, ఏసీబీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే ప్రకటించిన ఆస్తులపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకులు పాపట్ల నరహరి, ముక్యర్ల సతీశ్ యాదవ్, కల్వకొలను సతీశ్ భట్, జీ రాజేశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సీలింగ్ భూముల కబ్జాపై విచారణ లేకపోతే ఉద్యమం బీఆర్‌ఎస్ నేత కర్రె వెంకటయ్య

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News