Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 06:40 AM

సీఐ వెంకటేశ్వర్లు చేతుల మీదుగా యోగ బ్రోచర్ ఆవిష్కరణ

26-03-2026 133 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేటలో 9 రోజుల యోగశిక్షణా తరగతులకు ఏర్పాట్లు పూర్తి

రామన్నపేట: ఆరోగ్యకర జీవనానికి యోగ సాధన అత్యంత అవసరమని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్. వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. రామన్నపేటలో నిర్వహించనున్న తొమ్మిది రోజుల యోగశిక్షణా తరగతుల బ్రోచర్‌ను ఆయన సబ్ ఇన్స్పెక్టర్ డి. నాగరాజుతో కలిసి ఆవిష్కరించారు.

అమృతవనం అగ్రిఫామ్ రిసార్టులో ఈ నెల 29 నుంచి వచ్చే నెల 6 వరకు శ్రీ శిరిడి సాయి అష్టాంగ ఆధ్వర్యంలో యోగ శిక్షణ తరగతులు జరగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 5.30 నుంచి 7 గంటల వరకు, సాయంత్రం 6.30 నుంచి 8 గంటల వరకు శిక్షణ ఇవ్వనున్నారు.

ఈ కార్యక్రమంలో యోగా గురువు యోగేశ్వర్, రిసార్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కడారి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శిక్షణలో భాగంగా వ్యాయామాలు, ప్రాణాయామాలు, సూర్య నమస్కారాలు, ధ్యానం, ఆసనాలు నేర్పించడంతో పాటు ‘అమృత ఆహారం’ అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

యోగాన్ని ప్రతి ఒక్కరూ జీవితంలో భాగంగా చేసుకోవాలని సీఐ సూచించారు. శిక్షణలో పాల్గొనదలచిన వారు 9603256572 నంబరును సంప్రదించాలని కోరారు.

Sthanikam

సీఐ వెంకటేశ్వర్లు చేతుల మీదుగా యోగ బ్రోచర్ ఆవిష్కరణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News