Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:48 AM

సర్పంచ్ భర్త జోక్యం… వార్డు సభ్యుడి ఫిర్యాదు

28-04-2026 311 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కోదాడ,

కూచిపూడి గ్రామపంచాయతీ పరిధిలో సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం, సర్పంచ్ భర్త జోక్యం పెరిగిందని ఆరోపిస్తూ 2వ వార్డు సభ్యుడు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

వార్డు సభ్యుడు కటిక గోపాల్‌రావు సమర్పించిన వినతిపత్రంలో… వార్డులో సీసీ రోడ్డుపై మురికి నీరు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఎండాకాలంలోనూ వర్షాకాల పరిస్థితులు నెలకొని దోమలు పెరిగి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు.

ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులను సమస్యాత్మక ప్రాంతాల్లో వినియోగించకుండా వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాలకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. గ్రామ సర్పంచ్ అందుబాటులో లేకపోవడంతో సమస్యలు మరింత పెరుగుతున్నాయని పేర్కొన్నారు.

సర్పంచ్ భర్త గ్రామపంచాయతీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ వార్డు సభ్యులను బెదిరిస్తున్నారని, సమస్యలు ప్రస్తావిస్తే అవమానకరంగా మాట్లాడుతున్నారని ఫిర్యాదులో తెలిపారు. పంచాయతీ సిబ్బందిని కూడా తన అనుమతి లేకుండా పనులకు వెళ్లనివ్వడం లేదని ఆరోపించారు.

ఈ అంశాలపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, వార్డులోని సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్‌ను కోరారు.

Sthanikam

సర్పంచ్ భర్త జోక్యం… వార్డు సభ్యుడి ఫిర్యాదు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News