Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పుట్టపర్తిలో తల్లీబిడ్డ అదృశ్యం. గుండ్రంపల్లి పాల సంఘం అధ్యక్షురాలిగా శైలజ మహేందర్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 30, 2026 03:28 PM

స్పాట్‌’ రెమ్యూనరేషన్ ఎప్పుడిస్తారు?

స్పాట్‌’ రెమ్యూనరేషన్ ఎప్పుడిస్తారు?

స్పాట్‌’ రెమ్యూనరేషన్ ఎప్పుడిస్తారు?
April 07, 2026 06:03 PM 79 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

 ఏడాది గడిచినా అందని పదో తరగతి మూల్యాంకన సొమ్ము..

నల్లగొండలో ఉపాధ్యాయ సంఘాల నిరసన ప్రదర్శన..

నల్లగొండ : గతేడాది నిర్వహించిన పదో తరగతి పరీక్షల మూల్యాంకన పారితోషికంతో పాటు కుల గణన విధులకు సంబంధించిన రెమ్యూనరేషన్‌ను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని ఉపాధ్యాయ జె.ఎ.సి. సంఘాలు డిమాండ్ చేశాయి. మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాల స్పాట్ వ్యాల్యూయేషన్ కేంద్రం వద్ద టీటీజేఏసీ, యూఎస్పీసీ, జాక్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. 2025 మార్చిలో జరిగిన పదో తరగతి స్పాట్ విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయులకు ఏడాది గడుస్తున్నా నేటికీ పైసా పారితోషికం అందకపోవడంపై నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే గత అక్టోబర్‌లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణన సర్వేలో పాలుపంచుకున్న ఉపాధ్యాయులకు కూడా పారితోషికం ఇవ్వడంలో జాప్యం చేయడం తగదని వారన్నారు. భోజన విరామ సమయంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ..

గత ఏడేళ్లుగా పదో తరగతి మూల్యాంకన పారితోషికం రేట్లను పెంచకపోవడం ఉపాధ్యాయులను వంచించడమేనని మండిపడ్డారు. ఇంటర్మీడియట్ బోర్డు ఇప్పటికే రెండుసార్లు రెమ్యూనరేషన్ పెంచినప్పటికీ, పాఠశాల విద్యలో మాత్రం అదే పాత రేట్లు కొనసాగించడం అన్యాయమని ధ్వజమెత్తారు. ఎస్ఎస్‌సీ స్పాట్ రేట్లను కనీసం 50 శాతం పెంచాలని ప్రస్తుత మూల్యాంకనం పూర్తయ్యే రోజే ఉపాధ్యాయుల ఖాతాల్లో నగదు జమ చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం తమ వినతులతో కూడిన పత్రాన్ని క్యాంపు అధికారికి అందజేశారు. ప్రభుత్వం స్పందించి బకాయిలు విడుదల చేయని పక్షంలో భవిష్యత్తులో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాలం నారాయణరెడ్డి, పెరుమాళ్ళ వెంకటేశం, ఎడ్ల సైదులు, నర్రా శేఖర్ రెడ్డి, అరుణ, భాను ప్రకాష్, నలపరాజు వెంకన్న, బోస్కా సైదులు రావ్ జనార్ధన్ తదితర జిల్లా, మండల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News