Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సౌమ్య విద్యామందిర్‌లో ఘనంగా ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు. నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 03, 2026 07:34 PM

“సమతుల ఆహారంతో ఆరోగ్యమే మహాభాగ్యం”

“సమతుల ఆహారంతో ఆరోగ్యమే మహాభాగ్యం”

“సమతుల ఆహారంతో ఆరోగ్యమే మహాభాగ్యం”
15-04-2026 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Somandepalli
Prakash

సోమందేపల్లి, ఏప్రిల్ 15 (స్థానికం ప్రతినిధి):

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలంలోని వినాయక నగర్ అంగన్వాడీ కేంద్రం-2లో పోషణ పక్వాడా కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు. CDPO డాక్టర్ శాంత లక్ష్మి ఆదేశాల మేరకు సూపర్వైజర్ సుభారాణి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

పోషణ పక్వాడా 7వ రోజు సందర్భంగా “సమతుల ఆహారం” (బ్యాలెన్స్‌డ్ డైట్) పై ప్రత్యేక అవగాహన కల్పించారు. పూర్తి భోజనం అంటే అన్నం, పప్పు, కూరగాయలు, పాలు, పెరుగు, పండ్లు వంటి అన్ని పోషకాలు ఒకే పళ్లెంలో ఉండే విధానాన్ని ‘థాలి’గా పేర్కొంటారని వివరించారు. శరీరానికి అవసరమైన పోషకాలు సమతులంగా అందినప్పుడే ఆరోగ్యకరమైన జీవితం సాధ్యమవుతుందని తెలిపారు.

గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు తీసుకోవాల్సిన ఆహారపు అలవాట్లపై ప్రత్యేకంగా సూచనలు ఇచ్చారు. స్థానికంగా లభ్యమయ్యే ధాన్యాలు, పప్పులు, ఆకుకూరలతోనే పోషకాహారం సిద్ధం చేసుకోవచ్చని వివరించారు. జంక్ ఫుడ్ వినియోగం వల్ల కలిగే అనారోగ్య సమస్యలను ఉదాహరణలతో తెలియజేశారు.

కార్యక్రమంలో భాగంగా తల్లిదండ్రులు, అంగన్వాడీ సిబ్బంది కలిసి ఇంట్లో లభ్యమయ్యే వ్యర్థ పదార్థాలతో విద్యా బొమ్మల తయారీపై ప్రదర్శన నిర్వహించారు. కాగితం, కార్డ్బోర్డ్, ప్లాస్టిక్ బాటిళ్లతో ఫ్లాష్ కార్డులు, అక్షరాలు-సంఖ్యల పజిల్స్, కలర్ బ్లాక్స్ తయారు చేసి చూపించారు. తక్కువ ఖర్చుతో పిల్లల్లో సృజనాత్మకత, మేధస్సు అభివృద్ధి చెందేలా చేయవచ్చని వివరించారు. తండ్రులు కూడా పిల్లల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ప్రోత్సహించారు.

ఇక పోషకాహారం ప్రాముఖ్యతను చాటి చెప్పేలా ఫుడ్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. మిల్లెట్స్, ఆకుకూరలు, పప్పులతో తయారైన వంటకాలను ప్రదర్శించారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల కోసం ప్రత్యేక మెనూలను చూపించి అవగాహన కల్పించారు. తల్లిదండ్రులు స్వయంగా తయారు చేసిన వంటకాల ప్రదర్శన ఆకట్టుకుంది. ఉత్తమ వంటకాలకు బహుమతులు అందజేసి ప్రోత్సహించారు.

గ్రామ పెద్దలు, సచివాలయ సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది పాల్గొని కార్యక్రమానికి మద్దతు తెలిపారు. “ప్రతి రోజు సమతుల ఆహారం – ఆరోగ్యకరమైన జీవితం”, “ఇంట్లో ఉన్న ఆహారంతోనే పూర్తి పోషణ సాధ్యం”, “పిల్లల ఎదుగుదలకి సరైన ఆహారం ఎంతో ముఖ్యం” వంటి సందేశాలను విస్తృతంగా తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ సుభారాణి, అంగన్వాడీ కార్యకర్తలు చంద్రకళ, రాధమ్మ, లబ్ధిదారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Sthanikam

“సమతుల ఆహారంతో ఆరోగ్యమే మహాభాగ్యం”

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News