Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:08 AM

సద్గురు యాదవ్‌కు సర్పంచ్ అభినందనలు.

సద్గురు యాదవ్‌కు సర్పంచ్ అభినందనలు.

సద్గురు యాదవ్‌కు సర్పంచ్ అభినందనలు.
30-04-2026 68 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పదో తరగతి ఫలితాల్లో రామన్నపేట మండలం భోగారం గ్రామానికి చెందిన సద్గురు యాదవ్ 532 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచాడు. ఈ సందర్భంగా భోగారం గ్రామ సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్ విద్యార్థి ఇంటికి వెళ్లి ప్రత్యేకంగా అభినందించారు.

విద్యార్థికి శాలువా కప్పి, మిఠాయిలు తినిపించి సన్మానించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన విద్యార్థి పట్టుదలతో చదివి మంచి ఫలితాలు సాధించడం అభినందనీయమని అన్నారు. తల్లిదండ్రుల కృషికి తగిన ఫలితం దక్కిందని, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. గ్రామంలోని ఇతర విద్యార్థులు కూడా వీరిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

సర్పంచ్ స్వయంగా ఇంటికి వచ్చి అభినందించడం పట్ల విద్యార్థి, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు

Sthanikam

సద్గురు యాదవ్‌కు సర్పంచ్ అభినందనలు.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News