Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:51 AM

రూ.2.5 కోట్ల బీటీ రోడ్లను ప్రారంభించిన మంత్రి సవిత

03-05-2026 64 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ నియోజకవర్గం, సోమందేపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆమె ప్రారంభించారు

అభివృద్ధి చేసిన నాయకులకు ప్రజల ఆశీర్వాదం పూలవర్షంగా మారుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రి శ్రీమతి సవిత పేర్కొన్నారు.

జూలకుంట నుండి ఓబులదేవరపల్లి గ్రామం వరకు సుమారు రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించిన బీటీ రోడ్డును మంత్రి ప్రారంభించారు. అలాగే హిందూపురం రహదారి నుండి రేణుక నగర్ వరకు రూ.50 లక్షలతో నిర్మించిన మరో బీటీ రోడ్డును కూడా ప్రజలకు అంకితం చేశారు.

ఈ సందర్భంగా గ్రామస్తులు మంత్రి సవితకు ఘన స్వాగతం పలుకుతూ పూలవర్షం కురిపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం రోడ్లు పూర్తి కావడం పట్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.

అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ, గతంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయిందని విమర్శించారు. అదే అసంతృప్తితో ప్రజలు అప్పట్లో నిరసనలు తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ అభివృద్ధిని వేగంగా ముందుకు తీసుకెళ్తోందన్నారు.

ఇంకా సోమందేపల్లి మండలంలో మరుకుంటపల్లి–పత్తికుంటపల్లి, హిందూపురం రహదారి–కొలింపల్లి, బ్రాహ్మణపల్లి–పందిపర్తి, మంచేపల్లి–పందిపర్తి, పోలేపల్లి–రాచుపల్లి క్రాస్ రోడ్ల నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు.

అదేవిధంగా చాలాకూరు నుండి మండ్లి, జూలకుంట చెరువులకు హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ కాలువ ద్వారా రూ.14 కోట్లతో సాగునీటి ప్రాజెక్టుకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ఆమోదం వచ్చిన వెంటనే పనులు ప్రారంభించి, పది చెరువులకు నీరు అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్న ప్రభుత్వానికి ప్రజలు మరింత మద్దతు ఇవ్వాలని మంత్రి సవిత కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

రూ.2.5 కోట్ల బీటీ రోడ్లను ప్రారంభించిన మంత్రి సవిత

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News